Home / Pakistan
Ships: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య వివాదం మరింతగా పెరుగుతోంది. జమ్ముకాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన 26 మంది పర్యాటకులను లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని నిర్ధారించుకున్న భారత్ తగిన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పాక్ తో వాణిజ్య, దౌత్యపరమైన సంబంధాలను తెంచుకుంటోంది. సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకుని వ్యూహాత్మకంగా […]
Pakistan: సింధూ నదిపై నిర్మించే ఏ నిర్మాణాన్నైనా పేల్చివేస్తామన్నారు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ వ్యవసాయ భూమికి 80% కు నీటిని అందించే సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. దీంతో అసహనాన్ని వ్యక్తం చేస్తోంది పాక్. సింధూ జలాలను మళ్ళించేందుకు నిర్మాణాన్ని చేపడితే పేల్చివేస్తామన్నారు. ఆసిఫ్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ మాట్లాడారు. ఆసిఫ్ రక్షణ మంత్రి అయినప్పటికీ అతనికి […]
Bangladesh: పాకిస్థాన్ పై భారత్ దాడి చేస్తే, బంగ్లాదేశ్ భారత్ పై దాడి చేయాలన్నారు ఆదేశ మాజీ సైనిక అధికారి, ప్రభుత్వ సలహదారు రెహమాన్. ఇందుకుగాను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ పాకిస్థాన్ పై దాడి చేసిన మరుక్షణం బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించాలని సూచించాడు. అందుకు చైనాతో కలిసి ఉమ్మడి సైనిక చర్యకు సిద్ధమవ్వాలన్నారు. తన ఫేస్ బుక్ ఖాతాలో బెంగాళీలో పోస్ట్ చేశాడు. ఈయన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ […]
India Pakistan: పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే జల యుద్ధం ( సింధూ నది జలాల నిలుపుదల) దౌత్య పరమైన ఆంక్షలు, పాకిస్థానీ పౌరులను ఆదేశానికి పంపించేయడం లాంటి చర్యలకు పూనుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ పై అర్థిక దాడులను ప్లాన్ చేస్తోంది భారత్. ఇది రెండు రకాలుగా ఉండనుంది. మొదటిది, పాకిస్థాన్ ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రేలిస్ట్ లోకి తీసుకురావడానికి ప్రయత్నించనుంది. రెండవది, ఉగ్రవాదులను తయారుచేయడంలో భాగంగా […]
Air space: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాశ్మీర్ పర్యటనకు వచ్చిన 26 మంది పర్యాటకులను లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమార్చారు. దాడి అనంతరం భారత్ తమ దేశంపై ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని దాయాది దేశం క్షణక్షణం భయంతో వణికిపోతోంది. పైకి ధీమాగా ఉన్నట్టు ప్రకటనలు చేస్తున్నా.. లోలోపల ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే యుద్ధానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. మరోవైపు భారత సరిహద్దులో సైనిక […]
Firing Breaks Out at India-Pakistan Borders: భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వరుసగా ఏడో రోజు కాల్పుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. అయితే ఇప్పటికే పాక్ డీజీఎంఓతో భారత డీజీఎంఓ చర్చించింది. అయినప్పటికీ పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడంతో పాక్‌పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాక్ గట్టి సమాధానం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి జరిగి నేటికి వారం రోజులు గడుస్తోంది. అప్పటి […]
Pakistan’s ISI Chief Mohammad Asim Malik National Security Advisor: పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జాతీయ భద్రత సలహాదారుడిగా నియమించింది. 2024 సెప్టెంబరులో ఐఎస్ఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్‌కు ఎన్ఎస్ఏ […]
Pak journalist twitter accounts banned in India: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ ఖాతాలు బంద్ చేసింది. ఈ మేరకు భారత్‌లో పాక్ జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలు నిలిపివేసింది. కేంద్రం ఆదేశాలతో ట్విట్టర్ ఖాతాలు నిలిచిపోయాయి. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భారత్ మీడియా తరఫున పనిచేస్తున్న పాకిస్థాన్ దేశానికి చెందిన ఎక్స్ ఖాతాలు రద్దు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత […]
Pakistan: భారత్ ధాటికి పాక్ వణికిపోతోంది. బయటకు మేకపోతు గాంభీర్యం కనపరుస్తున్నా లోపల బిక్కచచ్చిపోతోంది. ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుటుంబంతో సహా ఆర్మీ అధికారుల కుటుంబాలను విదేశాలకు తరలించారు. దీంతో భారత్‌ను ఎదుర్కొనే సత్తా పాక్‌కు లేదని తెలుస్తోంది. 2019లో పుల్వామా ఘటనలోనూ మునీర్‌కు సంబంధం ఉంది. పుల్వామా సమయంలో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధిపతిగా ఉన్నారు. పహల్గామ్ ఘటన వెనుక మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణంగా ప్రపంచ దేశాధినేతలు అభిప్రాయపడుతున్నారు. […]
Pahalgam terror Attack : పహల్గాంలో పర్యాటకుపై జగిరిన ఉగ్రదాడిలో 26 మంది దుర్మరణం చెందగా, మరికొందరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ నౌకాదళం సిద్ధమైంది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. పహల్గాంలో ఉగ్రదాడితో భారత్-పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే తన సన్నద్ధతను చాటేందుకు ఇండియన్ నేవీ తాజా పరీక్షలు నిర్వహించింది. […]