Home / Latest News
టీమిండియా బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సిరీస్ కు మరో భారత క్రికెటర్ దూరమయ్యాడు. గాయం కారణంగా మహ్మద్ షమీ జట్టు నుంచి దూరం కాగా తాజాగా రిషబ్ పంత్ కూడా తప్పుకున్నాడు.
ఇప్పుడంటే లైట్ వెయిట్ ఫోన్లను అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నాం కానీ గత ముప్పై ఏళ్ల ముందు సంగతి ఆలోచించండి. అప్పుడు ఇంత సౌకర్యాలు ఎక్కడున్నాయి చెప్పండి. అయితే మనం ఇప్పుడు చేసే మెస్సేజ్ కు ప్రత్యామ్నాయంగా ఉండే ఎస్ఎంఎస్ సర్వీస్ వచ్చి నేటికి సరిగ్గా 30ఏళ్లు అంట. అప్పట్లో వొడాఫోన్ ఇంజినీర్ ఒకరు మొట్టమొదటి సారిగా ఎస్ఎంఎస్ చేశారట.
సర్వసాధారణంగా ఏటీఎం అంటే డబ్బులు వచ్చే మెషీన్ అని మనకు తెలిసిందే. కాగా పెరుగుతున్న అధునాతన సాంకేతికతో పలురకాల ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ టెక్నాలజీ మరింత అడ్వాన్స్డ్ అయ్యి ఇప్పుడు ఏకంగా బంగారాన్ని కూడా ఇచ్చే ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. భారతదేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను శనివారం హైదరాబాద్ బేగంపేటలో ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా పలు రూట్లలో వందేభారత్ రైళ్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు దక్షిభారతం అందులోనూ తెలంగాణ ఆంధ్రా మధ్య కూడా ఓ రైలు పరుగులు పెట్టనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ నిర్ధారించారు.
హైదరాబాదులోని శిల్పకళావేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం తాను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ కిందే లెక్క అని వెల్లడించారు.
కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ సిలబస్‌లో కర్ణాటక రత్న, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించింది.
ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం వేళకు నష్టాలను చవిచూశాయి. స్టాక్ మార్కెట్లలో వరుస లాభాల జోరుకు బ్రేక్ పడింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన మెహరీన్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కాస్త భయంగా ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఫొటోలో మెహరీన్ ముఖం మొత్తం సూదులతో నిండిపోయింది. మొహం నిండా సూదులు గుచ్చుకొని ఉన్నప్పటికీ ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు పోజిచ్చింది.
శ్రీవారి హుండీ ఆదాయం సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఈ వార్షిక ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల హుండీ ఆదాయాన్ని టీటీడీ అంచనా వేసింది. కాగా అది చాలా తక్కువని రుజువు చేసేలా కేవలం 8 నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1161.74 కోట్లు నమోదైంది.
ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో ఓ కొత్త రూల్ తీసుకురానున్నారు. ఫుట్ బాల్ తరహాలో ఐపీఎల్ లోనూ 'సబ్ స్టిట్యూట్' విధానం ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.