Home / Latest News
బిగ్ బాస్ హౌస్ లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం రోజున జరిగిన 'టికెట్ టు ఫినాలే' రేసులో రేవంత్ తొందరపాటుతో గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దాంతో ఎలాంటి పోటీ లేకుండా శ్రీహాన్ ఫైనల్స్ కి వెళ్లిపోయాడు. ఇక ఈ వారం ఆదిరెడ్డిని సేఫ్ చేసి ఫైమాను ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్.
గుజరాత్ ఎన్నికల సందర్భంగా పారిపోయిన ఓ ఎమ్మెల్యే ఇప్పుడు అడవుల్లో ప్రత్యక్షమయ్యారు. బీజేపీ దాడితో అదృశ్యమైనట్టుగా చెబుతున్న గుజరాత్‌లోని దంతా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంతి ఖరాడిని పోలీసులు ఓ అడవిలో గుర్తించి తీసుకొచ్చారు. గుజరాత్ రెండో విడత పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు ఆయన బయటకు వచ్చారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సెకండ్ ఫేజ్‌లో మొత్తం 14 జిల్లాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ దృష్టి సారించింది. దీనిలో భాగంగా రూ.234 కోట్ల నిధుల మళ్లింపునకు సంబంధించి కేసు నమోదు చేసింది. ఈ మేరకు విచారణకు హాజరుకావాలంటూ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ గంటా సుబ్బారావులతో పాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసింది.
ప్రతి సీజన్లోనూ ఆ సీజన్లో ఉన్న వాతావరణంకు అనుగుణంగా ప్రత్యేకమైన అలర్జీలు వస్తుంటాయి. దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం, కళ్లలో నీరు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ అలర్జీలను కొన్ని ఇంటి చిట్కాలతో ఎదుర్కోవచ్చని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు. అవేంటో చూడండి.
రాష్ట్రంలో వైసీపీ పాలనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ పర్యటనపై రాష్ట్రంలో కొనసాగుతున్న ఆంక్షలపై జనసైనికులు మండిపడుతున్నారు. పవన్ ప్రజలను కలుసుకోకుండా ఎందుకు రాష్ట్రప్రభుత్వ నేతలు ఇంతగా ఆంక్షలు పెడుతున్నారు అనేది పలువురి ప్రశ్న. మరి దీనిపై ఈ ప్రత్యేక కథనం చూసేద్దామా..
ప్రస్తుతం షారూఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే చిత్రం నుండి విడుదలయిన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా ఈ సినిమా టీజర్ తాజాగా అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో అత్యధిక లైక్స్ సాధించిన టీజర్‌గా పఠాన్ రికార్డు క్రియేట్ చేసింది.
ఇటీవల కాలంలో టెక్ దిగ్గజాలు ఎడాపెడా లేఆఫ్స్‌కు తెగబడుతుండగా తాజాగా దేశీ కంపెనీలు ఒకదాని వెంట మరొకటి ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. భారత్‌కు చెందిన బడ్జెట్ హోటల్ చైన్ ఓయో ప్రోడక్ట్, ఇంజినీరింగ్ టీమ్స్‌లో 600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది.
సోహైల్ ను హన్సిక వివాహం చేసుకోనుంది. జైపూర్ లోని ఓ రాజకోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. అయితే, తన పెళ్లిలో పాల్గొనేందుకు కొంతమంది అతిథులకు కూడా హన్సిక ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. మరి వారెవరో తెలుసా..
రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజకీయాలకు అతీతంగా చేపట్టిన జోడో యాత్ర రాజకీయాలకు అతీతంగా సాగుతోంది. రాహుల్ వెంట పలువురు నటీనటులు వ్యాపారవేతలు ఇలా అనేక మంది నడక సాగిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో రాహుల్ వెంట ఈ యాత్రలో పాల్గొన్నందుకు ఓ స్కూల్ టీచర్‌ను సస్పెండ్ చేశారు.