Home / Latest News
మెదడులోని ఆలోచించనలతోనే పనులు చెయ్యగలిగితే ఎలా ఉంటుందంటారు. కలగా ఉండే ఈ ఆలచనలకు ప్రాణం పోస్తున్నారు స్పేస్ఎక్స్, న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్. కూర్చున్న చోటునుంచే ఎలాంటి కదలికలు లేకుండా మెదడు ద్వారానే ఆపరేట్ చేయగలిగే చిప్‌ను అభివృద్ధి చేసినట్టు ఆయన వెల్లడించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. తాజాగా ఈ వ్యాపార దిగ్గజం ఆరుగురు ప్రయాణించగల ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వార్షిక సర్వే 2022 వివరాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ సిటీ మొదటి స్ధానంలో నిలిచింది.
ఏపీలో మెడికల్ స్టూడెంట్స్ ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదని ఆ రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) స్పష్టం చేసింది.
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఇటీవలే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇది మరువకముందే మరో విండీస్ దిగ్గజం ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఇకపై ఐపీఎల్లో కనిపించడని తెలుస్తోంది.
టాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అన్విత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం రేవంత్ బిగ్ బాస్ సీజన్-6లో ఉన్నాడు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఏపీలో ఉండనున్నారు ఆమె. గతంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం ఏపీ వచ్చిన ఆమె.. ఈసారి రాష్ట్రపతి హోదాలో రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు.
కోట్లకు పడగలెత్తినా రాని "కిక్" సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన క్షణం తనకు కలిగిందని అంటున్నారు ఎన్నారై బిజినెస్ మ్యాన్ వెంకట్ దుగ్గిరెడ్డి. "గాలోడు" చిత్రం చూసిన తన చిన్ననాటి స్నేహితులు, బంధువులు, తన ఊరివాళ్లు, తోటి ఎన్నారై ఫ్రెండ్స్ ఆప్యాయంగా అందిస్తున్న అభినందనలు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయంటున్నాడు ఈ నెల్లూరీయుడు.
చికిత్సే కాని నివారణ లేని వ్యాధి ఎయిడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కోట్లాది మందిని బాధిస్తోంది. వ్యాధి చికిత్సకు మెరుగైన ఔషధాలు వచ్చాయి. కానీ పూర్తి స్థాయి నివారణ అనేది మాత్రం లేదు. కొన్ని తెలిసి తెలియని పరిస్థితుల కారణంగా కొందరు ఈ మహమ్మారి బారిన పడుతుంటారు. కాగా మీకు సాధారణమైన జీవనం సాగించాలని ఉండి మీ భాగస్వామి ద్వారా సంతతి కలగాలని ఆశ ఉందా అయితే మీకు ఐవిఎఫ్( ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పెద్దతి ఓ మంచి వరం.
ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో మూడు రోజుల పాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ నెల 4న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న తరుణంలో రేపు సాయంత్రం నుంచి మందు బంద్ కానుంది.