Home / Latest News
ఎంతో ప్రతిభావంతుడైన శాంసన్ కు సరైన అవకాశాలు ఇవ్వకుండా.. ఫామ్ కోల్పోయిన పంత్ ను ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై వన్డే టీమ్ స్టాండిన్ కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందిస్తూ, పంత్ టాలెంటెడ్ ప్లేయర్, మ్యాచ్ విన్నర్ అంటూ కితాబునిచ్చాడు.
ఫిఫా ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదైంది. సాకర్ టోర్నీలో పసికూనలైన జట్లు ఏ మాత్రం తమకు పోటీ కాదని భావించే డిఫెండింగ్ చాంపియన్‌కు షాక్ ఇచ్చింది. తాజాగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ ను ట్వునీషియా జట్టు నేలకరిపించింది.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా జంట తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తుంటుంది. మలైకా అరోరా తల్లికాబోతుందని, కొద్ది రోజుల్లో వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారంటూ ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రచరించింది. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కాగా ఆ విషయంపై ఇప్పుడు అర్జున్ కపూర్ నోరువిప్పాడు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ బుధవారం నాడు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసింది. చట్టవిరుద్ధమైన మతమార్పిడిని గుర్తించదగిన మరియు నాన్-బెయిలబుల్ నేరంగా పరిగణించింది. ఇలా మత మార్పిడిలకు పాల్పడితే కనీసం మూడు నుండి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో కూడిన కఠినమైన మత మార్పిడి నిరోధక బిల్లును ఆమోదించింది.
ట్విట్టర్ లో నకిలీ ఖాతాల బెడదను తొలగిస్తే బ్లూటిక్ కు చెల్లించే ఫీజు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ గురువారం ట్వీట్ చేశారు. ఫేక్ అకౌంట్లను ఎప్పటికప్పుడు ఏరిపారేస్తే బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు ఏం ఖర్చ 80 డాలర్లు అయినా చెల్లిస్తామని ట్వీట్టర్లో పేర్కొన్నారు.
హీరో విజయ్ దేవరకొండను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం సుమారు 12 గంటల పాటు విచారించింది. అయితే విచారణ ముగిసిన తర్వాత ఈడీ ఆఫీసు ముందు విజయ్ మాట్లాడారు. విచారణపై స్పందిస్తూ పాప్యులారిటీ పెరుగుతున్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం మామూలే అని రౌడీ బాయ్ వ్యాఖ్యానించారు.
కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబు హసన్ అల్-హషిమి అల్-ఖురేషీ మరణించాడు. ఈ మేరకు ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఓ ఆడియో ద్వారా ప్రకటించింది.
గుజరాత్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవగా సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మొత్తంగా 788 మంది అభ్యర్థులు బరిలో నిలచున్నారు.
విదేశాలకు వలస వెళ్లి ఉద్యోగాలతో పాటు నివాసం ఏర్పర్చుకోవాలనే వారి కోసం ఇంటర్ నేషన్స్ అనే సంస్థ ఒక జాబితాను విడుదల చేసింది.
మీకు శీతాకాలం అంటే ఇష్టమా. చల్లటి వాతావరణాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాధించడానికి మన భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. మరి ఆ ప్రదేశాలు ఏంటి, అక్కడి విశేషాలేంటో ఓ లుక్కెయ్యండి.