Last Updated:

Gold ATM: బంగారం ఇచ్చే ఏటీఎం.. ఎక్కడో తెలుసా..?

సర్వసాధారణంగా ఏటీఎం అంటే డబ్బులు వచ్చే మెషీన్ అని మనకు తెలిసిందే. కాగా పెరుగుతున్న అధునాతన సాంకేతికతో పలురకాల ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ టెక్నాలజీ మరింత అడ్వాన్స్డ్ అయ్యి ఇప్పుడు ఏకంగా బంగారాన్ని కూడా ఇచ్చే ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. భారతదేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను శనివారం హైదరాబాద్‌ బేగంపేటలో ప్రారంభించారు.

Gold ATM: బంగారం ఇచ్చే ఏటీఎం.. ఎక్కడో తెలుసా..?

Gold ATM: సర్వసాధారణంగా ఏటీఎం అంటే డబ్బులు వచ్చే మెషీన్ అని మనకు తెలిసిందే. కాగా పెరుగుతున్న అధునాతన సాంకేతికతో ఫుడ్ ఏటీఎం, వాటర్ ఏటీఎం, ఇలా పలురకాల ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ టెక్నాలజీ మరింత అడ్వాన్స్డ్ అయ్యి ఇప్పుడు ఏకంగా బంగారాన్ని కూడా ఇచ్చే ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. భారతదేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను శనివారం హైదరాబాద్‌ బేగంపేటలో ప్రారంభించారు.

డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో మీకు కావాల్సినంత బంగారాన్ని మీరు ఈ ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవచ్చు. అశోక్‌ రఘుపతి ఛాంబర్స్‌లోని గోల్డ్‌ సిక్కా సంస్థ ఈ అధునాత గోల్డ్ ఏటీఎంను రూపొందించారు. కాగా ఈ ఏటీఎంను తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్‌ ఏటీఎం ఒక ఉదాహరణని ఆమె అభివర్ణించారు. ఈ ఏటీఎం ద్వారా 99.99శాతం శుద్ధత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చని గోల్డ్‌ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్‌ తరుజ్‌ తెలిపారు. బంగారు నాణేలతోపాటు వాటి నాణ్యత, గ్యారంటీ తెలిపే పత్రాలు కూడా దీని ద్వారా పొందవచ్చునని ఆయన వెల్లడించారు. త్వరలో నగరంలోని గుల్జార్‌హౌస్‌, సికింద్రాబాద్‌, అబిడ్స్‌తోపాటు పెద్దపల్లి, వరంగల్‌, కరీంనగర్‌లలో ఈ గోల్డ్‌ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. బంగారం ధరలను ఎప్పటికప్పుడు ఏటీఎం స్క్రీన్‌పై కనిపిస్తాయని దాని ద్వారా ప్రజలు మరింత సులువుగా తమకు అవసరమైనప్పుడు గోల్డ్ కొనుగోలు చెయ్యవని వెల్లడించారు.

ఇదీ చదవండి: హైదరాబాద్-విజయవాడ మధ్య వందేభారత్ రైలు.. ఎప్పటి నుంచి అంటే..?

ఇవి కూడా చదవండి: