Home / latest national news
ఆధార్, రేషన్ కార్డుల అనుసంధానం గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.. వాస్తవానికి అసలు గడువు జూన్ 30తో ముగియాల్సి ఉండగా ఇప్పుడు మరో మూడు నెలలు పొడిగించింది. మోసాలను తగ్గించేందుకు ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం ఈ చర్య లక్ష్యం.
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కటకట తీవ్రంగా ఉంది. రాజధాని ప్రజలను మంచి నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. అదే సమయంలో ట్యాంకర్ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి.
లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మొట్టమొదటి పార్లమెంటు సమావేశాలు ఈ నెల 24 నుంచి జూలై 3 వరకు కొనసాగనున్నాయి. కాగా మొదటి మూడు రోజుల పాటు కొత్తగా ఎన్నికైనా లోకసభ సభ్యులు ప్రమాణ స్వీకారం జరుగుతుంది.
ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన మోహన్ చరణ్ మాఝీ పేరు ఖరారయింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కియోంఝర్ నుంచి 87,815 ఓట్ల మెజారిటీతో బీజేడీకి చెందిన మినా మాఝీపై విజయం సాధించారు. బుధవారం ఆయన ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఢిల్లీలోని ఆమ్ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం ఖాళీ చేయడానికి సుప్రీంకోర్టు ఆగస్టు 10వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ఏరియాలో ఆప్ పార్టీ ప్రధాన కార్యాలయం కొనసాగుతోంది.
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చారు. వచ్చి రాగనే పీఎం కిసాన్నిధి 17వ ఇన్స్టాల్మెంట్ ఫైల్‌పై సంతకం చేశారు.
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌ను చండీఘడ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ సందర్భంగా అక్కడి లేడీ కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. అటు తర్వాత సోషల్ మీడియాలో దీనిపై పెద్ద దుమారమే రేగింది.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్‌గాంధీ లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాలని పలువురు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాహుల్‌ను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ప్రతాప్‌సింగ్ బజ్వా చెప్పారు.
లోక్ సభలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపికైన నరేంద్రమోదీ ... ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను పార్టీ కోసం ఎనలేని కృషి చేసిన పార్టీ కార్యకర్తలను అభినందించారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ను చండీఘడ్ విమానాశ్రయంలో అక్కడి మహిళా సెక్యూరిటీ గార్డు గురువారం చాచి లెంపకాయ కొట్టడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కాగా రనౌత్ చండీఘడ్ నుంచి ఢిల్లీకి బయలుదేరడానికి ముందు సెక్యూరిటీ చెక్ వద్ద ఈ ఘటన జరిగింది.