Last Updated:

Parliament Session: ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు

లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మొట్టమొదటి పార్లమెంటు సమావేశాలు ఈ నెల 24 నుంచి జూలై 3 వరకు కొనసాగనున్నాయి. కాగా మొదటి మూడు రోజుల పాటు కొత్తగా ఎన్నికైనా లోకసభ సభ్యులు ప్రమాణ స్వీకారం జరుగుతుంది.

Parliament Session: ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు

Parliament Session: లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మొట్టమొదటి పార్లమెంటు సమావేశాలు ఈ నెల 24 నుంచి జూలై 3 వరకు కొనసాగనున్నాయి. కాగా మొదటి మూడు రోజుల పాటు కొత్తగా ఎన్నికైనా లోకసభ సభ్యులు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అటు తర్వాత స్పీకర్‌ ఎంపిక జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజుజు బుధవారం నాడు తెలిపారు. కాగా పార్లమెంటు సమావేశాలు జూలై 3న ముగుస్తాయి. ఇదిలా ఉండగా రాష్ర్టపతి ద్రౌపది ముర్ము లోక్ సభ, రాజ్యసభను ఉద్దేశించి జూన్‌ 27న ప్రసంగిస్తారు. వచ్చే ఐదు సంవత్సరాల కాలానికి కొత్త ప్రభుత్వం రోడ్‌ మ్యాప్‌ గురించి ఆమె వివరిస్తారు.

జూలై 3తో ముగింపు.. (Parliament Session)

ఇదిలా ఉండగా 264వ రాజ్యసభ సెషన్‌ మాత్రం జూలై 27 నుంచి మొదలై జూలై 3న ముగుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొత్త ఎంపికైన మంత్రులను పార్లమెంటు పరిచయం చేస్తారని రిజుజు ఎక్స్‌లో ఈ విషయాలను పోస్ట్‌ చేశారు. ఇక రాష్ర్టపతికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత పార్లమెంటు డిబెట్‌ జరుగుతుంది. ప్రతిపక్షాలు ఎన్‌డీఏ ప్రభుత్వంపై పలు అంశాలపై నిలదీసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు జవాబు చెబుతారు. జూలై 3న పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి.

 

ఇవి కూడా చదవండి: