Caller ID Trials: మొబైల్ ఫోన్లకు కాలర్ ఐడి ట్రయల్స్ ప్రారంభించిన టెలికాం కంపెనీలు
విసిగించే కాల్స్‌కు మోసపూరిత కాల్స్‌కు ఇక చెక్ పడనుంది. కేంద్రప్రభుత్వం ఒత్త్తిడితో పాటు టెలికం నియంత్రణా సంస్థ (ట్రాయ్) కూడా టెలికం ఆపరేటర్లపై ఒత్తిడి తేవడంతో విధి లేని పరిస్థితిలో దేశంలోని కొన్ని ఏరియాలో కాలర్ ఐడి సర్వీసులను అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉంది.
Caller ID Trials: విసిగించే కాల్స్‌కు మోసపూరిత కాల్స్‌కు ఇక చెక్ పడనుంది. కేంద్రప్రభుత్వం ఒత్త్తిడితో పాటు టెలికం నియంత్రణా సంస్థ (ట్రాయ్) కూడా టెలికం ఆపరేటర్లపై ఒత్తిడి తేవడంతో విధి లేని పరిస్థితిలో దేశంలోని కొన్ని ఏరియాలో కాలర్ ఐడి సర్వీసులను అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉంది. టెలికం ఆపరేటర్లు. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం దేశంలోని టెల్కోలు పరిమిత స్థాయిలో ఇటు ముంబై, అటు హర్యానాలో కాలర్ ఐడి సర్వీసులను ట్రయల్ మొదలుపెట్టాయి. అయితే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రాబోయే వారాల్లో మరిన్ని నగరాలకు ఈ ట్రయల్స్‌ను విస్తరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఫ్రాడ్ కాల్స్ కు అడ్డుకట్ట.. (Caller ID Trials)
కాగా సీఎన్‌ఏపీ అంటే కాలింగ్ నేమ్ ప్రజంటేషన్ ద్వారా స్పామ్‌తో పాటు ఫ్రాడ్ కాల్స్‌ను కొంత వరకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇటీవల కాలంలో దేశంలో ఫ్రాడ్‌కాల్స్ విపరీతంగా పెరిగిపోయి ప్రజలు పెద్ద ఎత్తున తమ వద్ద ఉన్న సొమ్మును పొగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే టెలికం ఆపరేటర్ల సమాచారం ప్రకారం ప్రస్తుతం పరిమిత స్థాయిలో ట్రయల్స్ జరుగుతున్నాయి. సీఎన్‌ఏపీపై మదింపు చేస్తున్నట్లు చెప్పారు. ఇన్‌కమింగ్ కాల్స్‌వచ్చినప్పుడు కేవలం నంబరు కాకుండా పేరు కూడా డిస్‌ప్లే అయ్యేలా ట్రయల్స్ జరుగుతున్నాయి. ట్రయల్స్ విజయవంతం అయిన తర్వాత వివరాలును డాట్‌కు సమాచారం అందిస్తామని సీనియర్ టెల్కో ఎగ్జిక్యూటివ్ అధికారి ఒకరు చెప్పారు.
ఇదిలా ఉండగా ఇటీవలే ట్రాయ్ సీఎన్‌ఏపీ గురించి ప్రభుత్వం త్వరలోనే ఒక నియమావళిని విడుదల చేసే అవకాశం ఉందని తెలిపింది. దేశంలో విక్రయించే అన్నీ మొబైల్ ఫోన్లకు కాల్‌ఐడి అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేయనున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి తేదీపై కూడా నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుందని ట్రాయ్ తెలిపింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను టెలికం ఆపరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల సాంకేతికంగా ఇబ్బందులు తప్పవని తమ వాదన వినిపిస్తోంది.
రిలయన్స్ జియోకు చెందిన ముఖేష్ అంబానీ దీనిపై స్పందిస్తూ.. ఈ సర్వీసు తప్పనిసరి కాదన్నారు. దీని వల్ల సాంకేతికంగా ఇబ్బందులు ఏర్పడుతాయని.. ఉదాహరణకు సిగ్నలింగ్ మీద లోడ్ పడి ఇంటర్ కనెక్షన్‌కు సంబంధించి సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని వివరించారు. ఎయిర్‌టెల్ కూడా సాంకేతిక ఇబ్బందులు తప్పవని వాదిస్తోంది. ఇక వోడా ఐడియా విషయానికి వస్తే సీఎన్‌ఏపీ అమల్లోకి తెస్తామని తెలిపింది. ఇది ఆప్షనల్ సర్వీసుమాత్రమే. తప్పకుండా అమలు చేయాలని లేదని వోడా ఐడియా వాదిస్తోంది.