Last Updated:

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో లోయలో టెంపో పడి 10 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. . 23 మంది ప్రయాణికులతో బయలు దేరిన టెంపో ట్రావెలర్‌ లోయలో పడ్డంతో పది మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్‌లోని భద్రీనాథ్‌ జాతీయ రహదారిలో రుద్రప్రయాగ్‌ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో లోయలో టెంపో పడి 10 మంది మృతి

 Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. . 23 మంది ప్రయాణికులతో బయలు దేరిన టెంపో ట్రావెలర్‌ లోయలో పడ్డంతో పది మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్‌లోని భద్రీనాథ్‌ జాతీయ రహదారిలో రుద్రప్రయాగ్‌ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల సంఖ్య పదికి చేరిందని గర్హవాల్‌ ఐజీ కరణ్‌సింగ్‌ నాగ్న్యాల్, చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ టెంపో ట్రావెలర్‌లో మొత్తం 23 మంది ప్రయాణిస్తున్నారు. రిషికేష్‌ – భద్రీనాథ్‌ జాతీయ రహదారిపై శనివారం నాడు ఉదయం టెంపో ట్రావెలర్‌ లోయలో పడింది. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి మెరుగైన చికిత్స కోసం విమానాల ద్వారా రిషికేష్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. మరో 9 మంది ప్రస్తుతం స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఐజి కరణ్‌సింగ్‌ చెప్పారు.

నోయిడా నుంచి రుద్రప్రయాగ్..( Uttarakhand)

సంఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ను రాష్ర్ట డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌తో పాటు స్థానిక పోలీసులు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ టెంపో ట్రావెలర్‌ నోయిడా నుంచి రుద్రప్రయాగ్‌ వెళ్తోంది. అయితే రుద్రప్రయాగ్‌ సమీపిస్తుండగా టెంపో అదుపు తప్పి 150 నుంచి 200 మీటర్ల లోతైన లోయలో పడింది. మృతుల కుటుంబాలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని అమిత్‌ షా హామీ ఇచ్చారు. తీవ్రమైన గాయాలైన ప్రయాణికులను రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు విమానంలో తరలిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ థామి అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి: