Home / latest national news
బెంగళూరు కోర్టులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి బెయిల్ దక్కింది. గత ఏడాది కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అప్పటి భారతీయ జనతాపార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, 40 శాతం కమిషన్ తీసుకుని పనులు చేస్తోందని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వార్త పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
లోకసభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు దక్కించుకుంది. మెజారిటి మార్కు 272 కాగా బీజేపీకి 32 సీట్లు తగ్గాయి. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. కాగా ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ వరుసగా మూడో సారి జూన్ 8న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎన్డీఏ మొత్తం 292 సీట్లు సాధించింది.
గత ఏడాది అక్టోబర్ 7 తెల్లవారుఝామున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడులకు తెగబడి సుమారు 1,200 మంది చంపి ... 250 మంది ఇజ్రాయెల్ పౌరులను తమ వెంట తీసుకువెళ్లారు. అటు నుంచి ఇజ్రాయెల్ గాజాపై ప్రతీకారదాడులకు పాల్పడుతోంది
ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లోని చురు, హర్యానాలోని సిర్సాలో పగటి ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రతను మించిపోయాయి. సరాసరి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటింది.
కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఈ నెల 31న అంటే శుక్రవారం జర్మనీ నుంచి బెంగళూరు చేరుకోనున్నారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అయితే శుక్రవారం నాడు ఆయన బెంగళూరు విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయనను అరెస్టు చేస్తామని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర్ బుధవారం నాడు చెప్పారు.
ఒడిషా ముఖ్యమంత్రి బిజూ జనతాదళ్ (బీజేడీ) సుప్రీమో నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 24గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకరోజు ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఇవాళ 52.3 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు 49డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటి పోయాయి. అలాగే రాజస్థాన్ లోని చురు, హర్యానాలోని సిర్సాతో సహా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఆల్ టైమ్ రికార్డుగా నిలిచాయి.
రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘరామ్ రాజన్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? గత కొంత కాలంగా రాజన్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున పుకార్లు వెల్లువెత్తాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. డిసెంబర్ 2022లో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో రాజన్ రాహుల్‌తో కలిసి వెంట నడిచారు.