Home / latest national news
రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పార్కింగ్ స్థలం సమస్యను పరిష్కరించడానికి కేరళ ప్రభుత్వం మొబైల్ పార్కింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. కొచ్చి మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (KMTA) నేతృత్వంలోమొబైల్ యాప్ ద్వారా పార్కింగ్ స్థలాలను ముందుగానే రిజర్వ్ చేసుకోవడానికి మరియు చెల్లించడానికి వినియోగదారులను అనుమతించాలని భావిస్తోంది.
హిందూత్వం భయం, ద్వేషాలను వ్యాప్తి చేయదు.. అయితే బీజేపీ అదే చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటు ఉభయసభల నుద్దేశించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ హిందూ మతం అంటే భయం, ద్వేషం మరియు అసత్యాలను వ్యాప్తి చేయడం కాదని బీజేపీపై మండిపడ్డారు.
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. .జ్యుడీషియల్ కస్టడీ కోరుతూ రోస్ అవెన్యూ కోర్టుకు ఇచ్చిన దరఖాస్తులో, అరవింద్ కేజ్రీవాల్ దర్యాప్తుకు సహకరించడం లేదని తెలిపింది.
లడఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద ట్యాంక్ ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో ష్యోక్ నదిని దాటుతుండగా T72 ట్యాంక్ కొట్టుకుపోవడంతో ఐదుగురు ఆర్మీ సిబ్బంది కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. నదిలో నీటిమట్టం పెరగడం వల్ల ట్యాంక్ మునిగిపోయిందని అధికారులు తెలిపారు.
తమిళనాడు రాష్ట్రానికి నీట్ పరీక్షనుంచి మినహాయింపు ఇవ్వాలని , 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులను మెడికల్ కోర్సుల్లో చేర్చుకునేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతంశుక్రవారం తెల్లవారుజామునుంచి ఉరుములు మరియు ఈదురు గాలులతో కూడిన ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలమైంది.ఇటీవలి వేడి నుండి ఢిల్లీవాసులకు చాలా ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించింది.
శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన తరువాత, టెర్మినల్ 1 నుండి అనేక విమానాలు రద్దు చేయబడ్డాయి మరియు అనేక ఇతర సర్వీసులు ఇతర టెర్మినల్‌లకు మార్చబడ్డాయి.
18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణీ ఓటుతో ఆయన ప్రతిపక్ష కూటమి అభ్యర్ది కె. సురేష్ పై గెలుపొందినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తీసుకుని వెళ్లారు.
ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం లోక్ సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఆయన పాలస్తీనా అనుకూల నినాదాలు చేయడంతో దుమారం రేగింది. బీజేపీకి చెందిన శోభా కరంద్లాజె అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ప్రిసైడింగ్ అధికారి రాధామోహన్ సింగ్ దానిని రికార్డు నుండి తొలగించాలని ఆదేశించారు.
భారీ వర్షాలు కురవడంతో అయోద్య రామాలయం గర్భగుడి పైకప్పు నుంచి నీరు కారుతోందని రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు.ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు