West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొన్న గూడ్స్ ట్రెయిన్..15 మంది మృతి..
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందగా..60 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి కారణం గూడ్స్ రైలు కంచన్‌జుంగ ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి ఢీ కొట్టడమని పోలీసులు వివరించారు.
West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందగా..60 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి కారణం గూడ్స్ రైలు కంచన్‌జుంగ ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి ఢీ కొట్టడమని పోలీసులు వివరించారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషయమంగా ఉందని డార్జిలింగ్ అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ రాయ్ చెప్పారు.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. (West Bengal)
ఇక కంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్ రైలు విషయానికి వస్తే అస్సాంలోని సిల్‌చార్ నుంచి కోలకతాలోని సీల్దా వరకు ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తోంది. కాగా కంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్ న్యూ జల్‌పాయిగురికి సమీపంలోని రంగపాణి స్టేషన్ వద్ద నిలిచి ఉండగా గూడ్స్ ట్రెయిన్ వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టిందని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సభ్యసాచి డే తెలిపారు. ఇదిలా ఉండగా రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ప్రకటనలో రెస్క్యూ ఆపరేషన్ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని చెప్పారు. రైల్వేలు, ఎన్‌ఆర్‌డీఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌లు కలసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని వైష్ణవ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా ఈస్ర్టన్ రైల్వే రంగపాణి రైల్వేస్టేషన్ కంట్రోల్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. ఇక ఈ ప్రమాదం గురించి రైల్వే వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం గూడ్స్ కంటైనర్ ట్రెయిన్ సిగ్నల్‌ను దాటి కంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో రెండు పార్సిల్స్‌తో పాటు గార్డ్ ఉండే కోచ్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, డివిజనల్ రైల్వే అధికారులు ప్రమాదం స్థలానికి చేరుకున్నారు. మొత్తం 15 అంబులెన్స్‌లను ప్రమాద స్థలానికి తరలించారు. పరిస్థితిని రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా ఈ ప్రమాదం సోమవారం ఉదయం 8.45 గంటలకు జరిగింది.ప్రమాదం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలానికి డీఎం, ఎస్‌పీ, డాక్టర్లను అంబులెన్స్ లను డిజాస్టర్ టీంను పంపించామని పశ్చిమ బెంగాల్ సీఎం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.