Varun Tej: ఈసారి నవ్వించేందుకు రెడీ అయిన వరుణ్ తేజ్, కొత్త సినిమా ప్రకటన ఇచ్చిన మెగా ప్రిన్స్ – డైరెక్టర్ ఎవరంటే..

Varun Tej New Movie Announcement: మెగా హీరో వరుణ్ తేజ్ ఈ మధ్య చెప్పుకొదగ్గ ఒక్క హిట్ లేదు. వరుస ప్లాప్స్‌తో ఢిలా పడ్డాడు. గతేడాది మట్కా అంటూ పీరియాడికల్ డ్రామాతో వచ్చాడు. కానీ ఈ సినిమా అనుకోని రీతిలో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రీమియర్స్‌తోనే ప్లాప్ టాక్ రావడంతో ఏకంగా పలు థియేటర్‌లో మట్కా ప్రదర్శనలను నిలిపివేశారు. వారం రోజుల్లోనే ఈ సినిమా థియేటర్ల నుంచి బయటకు వచ్చింది. అలా వరసగా ప్లాప్స్, డిజాస్టర్స్ చూసిన వరుణ్ ఈసారి హిట్ డైరెక్టర్‌తో జతకట్టాడు.
ఇవాళ వరుణ్ తేజ్ పుట్టిన రోజు. జనవరి 19న అతడి బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించాడు. అతడి 15వ సినిమా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, మాస్ట్రో వంటి చిత్రాలు తెరకెక్కించిన మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇండో-కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ సాగనుందని ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే అర్థమైపోతుంది.
హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కునున్న ఈ చిత్రానికి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందులో వరుణ్ తేజ్ క్యారెక్టర్ సరికొత్తగా ఉండనుందట. బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాపై ప్రకటన ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ మూవీపై ఆసక్తిని పెంచుతుంది. VT15 అనే వర్కింగ్ టైటిల్‌తో ఉన్న ఈపోస్టర్‌లో డ్రాగన్ సింబల్‌తో ఉన్న ఓ పాట్‌ను చూపించారు. డ్రాగన్ సింబల్‌తో పాటు కొరియన్ భాషలో రాసి ఉన్న ఓ రిబ్బన్ కూడా చూపించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ని జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మూవీ వెల్లడించనుంది.
ఇవి కూడా చదవండి:
- Sankranthiki Vasthunam Box Office Collection Day 5: బ్లాక్‌బస్టర్ పొంగల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ 5 రోజుల కలెక్షన్స్.. ఎంతంటే!