Home / latest ap news
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్ వద్ద జరుగుతున్న పనులని చూశారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి వారాహి యాత్రను చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో వారాహి యాత్ర ప్రారంభం అవుతుండడంతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జనసేన సమన్వయకర్తలను నియమించారు.
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న కేసుల విచారణని తిరగతోడాలని తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించబోతున్నానని జోగయ్య ప్రకటించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారయింది. ఏపీలో ఈ నెల 14 నుంచి పవన్ యాత్ర ప్రారంభిస్తారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు. ముందుగా అన్నవరంలో పూజలు చేసి యాత్రకు బయలుదేరనున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ఈ మేరకు రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్రాక్టర్ కూడా నడపడం విశేషం. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలువురు రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేశారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం - విజయవాడ - తెలంగాణలోని శంషాబాద్ మధ్యలో మొదటిది, విశాఖపట్నం - విజయవాడ - కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్
విజయవాడలో రాజకీయాలు ఎండ దెబ్బ కంటే మరింత వేడిగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ కేశినేని విషయం బెజవాడలో హాట్ టాపిక్ గా మారుతుంది. కాగా ఇటీవల కాలంలో టీడీపీపై గుర్రుగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని టికెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్
రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం తమదని సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహిస్తున్న రైతు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రైతుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులను బటన్ నొక్కి రిలీజ్ చేశారు. అదే విధంగా బహిరంగ సభలో మాట్లాడుతూ..
కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యేలని పొగుడుతున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడిన కేశినేని నాని విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకిచ్చినా ఫర్వాలేదని, ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్‌గానైనా గెలుస్తానేమోనని అన్నారు.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.