Pawan Kalyan: కాసేపట్లో మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్
సెక్షన్ 30 యాక్ట్‌ని ప్రభుత్వం అమలు చేయడంతో యాత్ర ఏ విధంగా నిర్వహించాలన్నఅంశంపై చర్చించనున్నారు.రేపు జనసేన పార్టీ కార్యాలయంలో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తరువాత పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శాంతి హోమం ప్రారంభం అవుతుంది.

Pawan Kalyan: సెక్షన్ 30 యాక్ట్‌ని ప్రభుత్వం అమలు చేయడంతో యాత్ర ఏ విధంగా నిర్వహించాలన్నఅంశంపై చర్చించనున్నారు.రేపు జనసేన పార్టీ కార్యాలయంలో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తరువాత పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శాంతి హోమం ప్రారంభం అవుతుంది.
రోజు విడిచి రోజు బహిరంగ సభలు.. ( Pawan Kalyan)
ఎల్లుండి జన సేన పార్టీ కార్యాలయంలో ఇతర పార్టీల కార్యకర్తలు, నేతల చేరికలుంటాయి. ఆ తరువాత బయలు దేరి అన్నవరానికి చేరుకుంటారు. ఈ నెల 14న తేదీ అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు బహిరంగ సభలు ఉండేలా ప్లాన్ చేశారు.జూన్ 14న ప్రత్తిపాడు కత్తిపూడి జంక్షన్‌లో బహిరంగ సభ ఉంటుంది. జూన్ 16న పిఠాపురం ఉప్పాడ జంక్షన్‌లో, జూన్ 18న కాకినాడ సర్పవరం జంక్షన్‌లో, జూన్ 21న అమలాపురం గడియారం స్థంభం సెంటర్‌లో బహిరంగ సభ,జూన్ 22న రాజోలు మల్కిపురం సెంటర్‌లో బహిరంగ సభ ఉంటాయి. మధ్యలోపార్టీ శ్రేణులతో సమావేశాలు ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
- Minsiter Roja : తీవ్ర అస్వస్థతకు గురైన మంత్రి రోజా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
- Jabardasth Comedian : మరింత క్షీణించిన జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం.. అండగా ఏపీ సర్కారు