Home / latest ap news
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై 55 అభియోగాలతో కూడిన ప్రజా చార్జ్ షీట్ ను కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య విడుదల చేశారు. జగన్ ప్రభుత్వాన్ని మరోసారి కొనసాగించాలా? వద్దా? అని ఛార్జ్ షీట్ ద్వారా ప్రజలను ప్రశ్నించారు.
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారి సహా ఇద్దరు మహిళలు కూడా ఉండగా.. మృతులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలియటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
సెక్షన్ 30 యాక్ట్‌ని ప్రభుత్వం అమలు చేయడంతో యాత్ర ఏ విధంగా నిర్వహించాలన్నఅంశంపై చర్చించనున్నారు.రేపు జనసేన పార్టీ కార్యాలయంలో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తరువాత పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శాంతి హోమం ప్రారంభం అవుతుంది.
విజయవాడలో వైకాపా ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా కారు బీభత్సం సృష్టించింది. స్థానిక బీఆర్టీఎస్ రోడ్ లో అర్ధరాత్రి 2:30 గంటలకు ఎమ్మెల్సీ కారు.. బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గుణదల పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి
టాలీవుడ్ లో ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తమ ఫైట్స్ తో ప్రేక్షకులను అలరించారు ఈ సోదరులు. అయితే తాజాగా ఈ అన్నదమ్ములు రీసెంట్ గా చేసిన ఒక పని అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని చీరాలలో జోళి పట్టి బిక్షాటన చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశంలో కొత్తగా 50 వైద్య కళాశాలలను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా ఇందులో 17 కాలేజీలు ఏపీ, తెలంగాణకు కేటాయించడం గమనార్హం. కాగా ఇందులో తెలంగాణకు 12 మెడికల్ కాలేజీలు.. ఆంధ్రప్రదేశ్ కి ఐదు మెడికల్ కాలేజీలు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ 12వ తేదీ నుండి స్కూల్స్ పునఃప్రారంభమవుతాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా వెల్లడించారు. ఈ నెల 12న పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ ప్రభుత్వ పథకం జగనన్న విద్యా కానుక కిట్ లను విద్యార్థులకు అందిస్తారని మంత్రి తెలిపారు. దాదాపు రూ.2500తో జగనన్న విద్యా కానుక కిట్ లు ఇస్తున్నట్లు వెల్లడించారు.
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాసేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాయుడు ఇటీవల తమ జట్టు గెలిచిన ఐపీఎల్ 2023 ట్రోఫీని సీఎంకు చూపించారు. సీఎం జగన్ అంబటిని, అతను ప్రాతినిధ్యం వహించిన చెన్నై
అమరావతిలో ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఉద్యోగులకు సీపీఎస్ బదులు జీపీఎస్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. గ్రూప్ వన్, గ్రూప్ టూ ఉద్యోగాల నోటిఫికేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం క్రమబద్దీకరణ చేయాలని కేబినేట్ నిర్ణయించింది.