Last Updated:

YS Viveka’s murder case: వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐకి కీలక విషయాలు వెల్లడించిన వివేకా కుమార్తె సునీత

వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత సీబీఐకి కీలక విషయాలు వెల్లడించింది. వివేకా హత్య కేసు ఛార్జిషీట్‌తోపాటు సునీత ఇచ్చిన వాంగ్మూలాలని సునీత వాంగ్మూలాలను సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న వైఎస్ భారతి ఫోన్ చేశారు సునీత చెప్పారు

YS Viveka’s murder case: వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐకి కీలక విషయాలు వెల్లడించిన  వివేకా కుమార్తె సునీత

 YS Viveka’s murder case:  వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత సీబీఐకి కీలక విషయాలు వెల్లడించింది. వివేకా హత్య కేసు ఛార్జిషీట్‌తోపాటు సునీత ఇచ్చిన వాంగ్మూలాలని సునీత వాంగ్మూలాలను సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న వైఎస్ భారతి ఫోన్ చేశారు సునీత చెప్పారు. తాను కడప, సైబరాబాద్ కమిషనరేట్ వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పానని సునీత తెలిపారు. ఎక్కువ సమయం తీసుకోదంటూ వైఎస్ భారతి వెంటనే ఇంటికి వచ్చారని సునీత వెల్లడించారు.

సజ్జలతో టచ్ లో ఉండాలని చెప్పారు..( YS Viveka’s murder case)

ఆమెతోపాటే విజయమ్మ, వైఎస్ అనిల్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రావడంతో ఆశ్చర్యపోయానని సునీత సిబిఐకి చెప్పారు. లిఫ్టు వద్దే నిలబడి వైఎస్ భారతితో మాట్లాడానని, వైఎస్ భారతి ఆందోళనగా కనిపించారు వివేకా కుమార్తె సునీత వివరించారు. నాన్న మరణించాక తొలిసారి ఇంటికొచ్చినందుకు బాధగా ఉన్నారని అనుకున్నానని సునీత వాంగ్మూలమిచ్చారు.ఇకపై ఏం చేసినా సజ్జల రామకృష్ణారెడ్డితో టచ్‌లో ఉండాలని భారతి చెప్పారని సునీత గుర్తు చేసుకున్నారు. మీడియాతో మాట్లాడాలని సజ్జల రామకృష్ణారెడ్డి తనకి చెప్పారని సునీత వెల్లడించారు. సజ్జల ఆలోచన కొంత ఇబ్బందిగా అనిపించి వీడియో చేసి పంపించానని సునీత తెలిపారు. గది శుభ్రం చేసేటప్పుడు ఉన్న సి.ఐ శంకరయ్యపై ఫిర్యాదుతో ఆ వీడియో పంపించానని సునీత చెప్పారు.

అయితే వీడియో కాదు అంశానికి ముగింపు పలికేలా ప్రెస్‌మీట్ పెట్టాలని సజ్జల సూచించారని సునీత సిబిఐ అధికారులకి చెప్పారు. జగనన్నతోపాటు అవినాష్ పేరు కూడా ప్రస్తావించాలని సజ్జల సలహా ఇచ్చారని సునీత వివరించారు. తాను అప్పటివరకు అవినాష్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదని సునీత గుర్తు చేశారు. అవినాష్ పేరు ప్రస్తావించాలని సజ్జల చెప్పినప్పుడు కొంత సంకోచించానని, ఎందుకంటే అవినాష్ అభ్యర్థిత్వాన్ని తన తండ్రి కోరుకోలేదన్న విషయం తెలుసని సునీత అన్నారు.

దశాబ్దాలుగా విబేధాలు..

రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విబేధాలున్నాయన్న విషయాన్ని సునీత బయటపెట్టారు. సజ్జల సలహా మేరకు హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టానని సునీత సిబిఐకి చెప్పారు. గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని మొదట్నుంచీ అడుగుతున్నానని, పొరపాటున జరిగిందని తెలుసని సునీత తెలిపారు. క్రిమినల్ మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోలేక పోయానని సునీత అన్నారు. జగనన్నను సీఎంగా చూడాలని నాన్న చాలా కష్టపడ్డారని, అందుకే ఎవరో చేసిన పొరపాటు వల్ల మళ్లీ జగన్ నష్టపోవాలా అని ఆలోచించానని సునీత చెప్పిన విషయాలని సిబిఐ అధికారులు చార్జ్‌షీట్లో పొందుపరిచారు.