CM Jagan: అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి.. లేదా కడుపయినా చెయ్యాలంటాడు.. బాలకృష్ణపై సీఎం జగన్ సెటైర్లు
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్, లోకేష్, బాలకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు. మంచి చేస్తున్న వ్యవస్థలను కొంతమంది విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
CM Jagan: నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్, లోకేష్, బాలకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు. మంచి చేస్తున్న వ్యవస్థలను కొంతమంది విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
వాలంటీర్లపై తప్పుడు వ్యాఖ్యలకు నిర్మాత..(CM Jagan)
వాలంటీర్లపై కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైరయ్యారు. వాలంటీర్లపై తప్పుడు వ్యాఖ్యలకు నిర్మాత చంద్రబాబే అని ఆరోపించారు. పదేళ్లుగా చంద్రబాబుకు ప్యాకేజీ స్టార్ వాలంటీర్ పనిచేస్తున్నారని విమర్శించారు. క్యారెక్టర్ లేని వాళ్లంతా వాలంటీర్ల గురించి మాట్లాడతారా? అని ధ్వజమెత్తారు.వాలంటీర్లపై తప్పుడు వ్యాఖ్యలకు నిర్మాత చంద్రబాబే.నటన, మాటలు అన్నీ దత్తపుత్రుడివి.దత్తపుత్రుడు అమ్మాయిలను లోబర్చుకుని పెళ్లి చేసుకోవడం, నాలుగేళ్లు కాపురం చేయడం మళ్లీ వదిలేయడం చేస్తాడని జగన్ ఆరోపించారు. మళ్లీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం మళ్లీ వదిలేయడం అతనికి అలవాటన్నారు. అమ్మాయిలతో స్విమ్మింగ్‌పూల్‌లో డ్యాన్స్ చేస్తూ మందుతాగుతూ మరొకరు ఉంటారని లోకేష్ ను ఉద్దేశించి అన్నారు. మరొక వ్యక్తి అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలంటాడంటూ నందమూరి బాలకృష్ణపై సెటైర్లు వేసారు. వీరంతా ఇలా ఉంటే మరొక పెద్ద మనిషి 75 ఏళ్లు వచ్చినా టీవీ షోలో తన బావమరిదితో మాట్లాడుతూ ఇపుడు మీరు సినిమాల్లో చేసేవన్నీ తాను చిన్నప్పుడే చేసానంటూ చెబుతాడని చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు.
క్యారెక్టర్ లేని వ్యక్తులు..
క్యారెక్టర్ లేని వ్యక్తులు వాలంటీర్లపై మాట్లాడుతున్నారని వీళ్ల మెదడులో అంతా పురుగులే కనిపిస్తాయని జగన్ విరుచుకుపడ్డారు. వీళ్ల బుద్ధి అంతా కుళ్లు, కుట్రలే కనిపిస్తాయన్నారు.
బీజేపీతో పొత్తు, టీడీపీతో బంధం అంటూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసారు. టీడీపీకి జనసేన బీ టీమ్ గా జగన్ అభివర్ణించారు. వాలంటీర్లు మన కుటుంబసభ్యులు. వాలంటీర్లు పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని అన్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదు బ్యాక్‌బోన్ క్లాసులని జగన్ అన్నారు. సొంత మగ్గం ఉన్న నేతన్నలకు రూ.24 వేల సాయం అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఆర్థిక సాయం అందుతుందన్నారు. చేనేతలను గత ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో చేనేతల ఆత్మహత్యలు ఉండేవని పేర్కొన్నారు.