Last Updated:

YS Vivekananda Reddy murder case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. సీబీఐ చార్జిషీట్‌లో కీలక అంశాలు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ చార్జిషీట్‌లో ప్రస్తావించిన కీలక అంశాలు బయటికి వచ్చాయి. హత్యకు కుట్ర చేశారని, ఘటనాస్థలంలో ఆధారాలు చెరిపేశారని సీబీఐ తెలిపింది. ఫొటోలు, గూగుల్ టేక్ అవుట్, లొకేషన్ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్యకు అవినాష్, భాస్కర్‌రెడ్డి కుట్ర చేశారని సీబీఐ నిర్థారించింది.

YS Vivekananda Reddy murder case: వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు..  సీబీఐ చార్జిషీట్‌లో కీలక అంశాలు.

 YS Vivekananda Reddy murder case:  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ చార్జిషీట్‌లో ప్రస్తావించిన కీలక అంశాలు బయటికి వచ్చాయి. హత్యకు కుట్ర చేశారని, ఘటనాస్థలంలో ఆధారాలు చెరిపేశారని సీబీఐ తెలిపింది. ఫొటోలు, గూగుల్ టేక్ అవుట్, లొకేషన్ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్యకు అవినాష్, భాస్కర్‌రెడ్డి కుట్ర చేశారని సీబీఐ నిర్థారించింది. వివేకా హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ చార్జ్ షీట్‌లో పేర్కొంది.

పీఏ కృష్ణారెడ్డి పాత్రపై ఆధారాలు లేవు..( YS Vivekananda Reddy murder case)

వివేకా పీఏ కృష్ణారెడ్డి పాత్రపై అనుమానాలున్నా ఆధారాలు లభించలేదని సీబీఐ తేల్చింది. ఆధారాల చెరిపివేత సమయంలో మనోహర్‌రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయం నిర్ధారణ కాలేదని సిబిఐ చెప్పింది. వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టయిన వారి వివరాలు సేకరిస్తున్నామని సిబిఐ వివరించింది. వైఫై రూటర్ల వివరాల కోసం అమెరికా అధికారులను కోరామని సీబీఐ వెల్లడించింది. వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష నివేదిక అందాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. గత నెల 30న సీబీఐ సమర్పించిన చార్జిషీట్ ను ఇటీవల కోర్టు విచారణకు స్వీకరించింది.