Home / latest ap news
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
టీడీపీ డ్రామాలు పీక్స్‌కి చేరాయని అందులో భాగంగానే చంద్రబాబుకు ముప్పు ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తప్పు చేసినట్లు ఆధారాలున్నాయని కోర్టు ధ్రువీకరించిందని అన్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ అన్నారు. దీనికి సంబంధించి నారా లోకేష్ చేసిన ట్వీట్ పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. మరి ముఖ్యంగా యువత వీటికి ఎక్కువగా అలవాటు పడుతూ పెడద్రోవ పడుతున్నారు. ఇక ఇదే అదనుగా నేరగాళ్లు తమ నేరాలను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అనారోగ్య వార్తలపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తోంది. రాజమహేంద్రవరం కేంద్ర కరాగారంలో వసతులపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.
అంగళ్ళు విధ్వంసం కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులోమ పలువురికి బెయిల్ మంజూరయిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖకు మార్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎంఓ షిఫ్టింగ్, మౌలిక సదుపాయాల ఏర్పాటు, మంత్రుల నివాసాల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాని నారా లోకేష్ కలిశారు. జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్ అమిత్ షాకు వివరించారు.
ఏపీలో 175 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు మంత్రి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఇంట్లో నేడు వైసీపీ నాయకులు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్ లు భేటీ అయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి తక్షణం ఏవైతే అవసరమో వాటిని రాబోయే ఎన్నికల మ్యానిఫెస్టోలో టీడీపీ, జనసేన మిశ్రమ ప్రభుత్వం అమలు జరిపేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామజోగయ్య తెలిపారు.