Last Updated:

Ganja Smuggling : గన్నవరంలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు.. ఎన్ని కేజీలో తెలిస్తే షాక్ అవుతారు ?

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. మరి ముఖ్యంగా యువత వీటికి ఎక్కువగా అలవాటు పడుతూ పెడద్రోవ పడుతున్నారు. ఇక ఇదే అదనుగా నేరగాళ్లు తమ నేరాలను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే

Ganja Smuggling : గన్నవరంలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు.. ఎన్ని కేజీలో తెలిస్తే షాక్ అవుతారు ?

Ganja Smuggling : తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. మరి ముఖ్యంగా యువత వీటికి ఎక్కువగా అలవాటు పడుతూ పెడద్రోవ పడుతున్నారు. ఇక ఇదే అదనుగా నేరగాళ్లు తమ నేరాలను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా పట్టుబడింది.

ఓ కారులో భారీగా గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు పక్కా ప్లాన్ తో బరిలోకి దిగిన పోలీసులు గన్నవరంలో ఓ ఇంట్లో బసచేసిన స్మగ్లర్లను అరెస్ట్ చేసి 100 కిలోల గంజాయి, తరలించేందుకు ఉపయోగిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పట్టుబడిని ఇద్దరు స్మగ్లర్లను జైలుకు తరలించి.. పరారయిన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గుజరాత్ కు చెందిన ఓ కుటుంబం ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం చేసేందుకు .. కృష్ణా జిల్లా గన్నవరంలోని సెయింట్ జాన్స్ హైస్కూల్ సమీపంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆ ఇంటిని గంజాయి స్మగ్లింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ విషయం కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం అందడంతో ఆ ఇంటిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే గురువారం ఒరిస్సా నుండి గుజరాత్ కు ఓ కారులో దాదాపు 100 కిలోల గంజాయిని తరలిస్తూ నలుగురు యువకులు గన్నవరం వచ్చారు.

ఎప్పటిలాగే విద్యానగర్ లో అద్దెకు తీసుకున్న ఇంటికి చేరుకుని బస చేసారు. ఇక పక్కా ప్లాన్ తో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసారు. పోలీసుల రాకను పసిగట్టిన ఇద్దరు యువకులు తప్పించుకుని పరారవ్వగా.. మిగతా ఇద్దరు పట్టుబడ్డారు. అలానే ఇంటిముందు నిలిపిన కారును తనిఖీ చేసిన పోలీసులు భారీగా గంజాయిని గుర్తించారు. వెంటనే ఆ గంజాయితో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి: