Home / International News
మెక్సికో దేశంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నాయారిట్ రాష్ట్రంలో రాజధాని టెపిక్‌కు కొద్ది దూరంలో ఉన్న బర్రాంకా బ్లాంకా ప్రాంతంలో రహదారి నుంచి బస్సు లోయలో పడిపోయింది. 40 మంది ప్రయాణికులతో టియువానా వైపు వెళుతున్న బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి 164 అడుగుల లోతున్న లోయలో పడిపోయిందని అక్కడి అధికారులు తెలిపారు.
కెన్యా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ కెన్యాలోని కెరిచో- నకురు పట్టణాల మధ్య హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. బాగా రద్దీగా ఉండే జంక్షన్లో ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు కెన్యా దేశ పోలీసులు తెలిపారు.
జపాన్ రాజధాని టోక్యో లోని ఓ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. టోక్యోలోని విమాశ్రయం రన్ వే పై రెండు కమర్షియల్ విమానాలు ప్రమాదవాశత్తూ ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అదృష్టవశత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు.
భారత్ మరోసారి ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు వేదిక కానుంది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు దేశం ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచ సుందరి 2023 పోటీలు రానున్న నవంబర్ లో దేశంలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎయిరిండియా విమానం రష్యాలో ఎమెర్జెన్సీ ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో కు బయలు దేరిన విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా రష్యా కు మళ్లించారు. అక్కడ సురరక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటకు వెళ్లనున్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు మోదీ అమెరికా వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 22 న ప్రధాని మోదీ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు.
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై సౌత్ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ పలు కీలక విషయాలు సేకరించింది. కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర నిద్రలేమి తో బాధపడుతున్నట్టు గుర్తించింది.
అమెరికా మిలిటరీ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు జూన్ 11 తేదీ లోపల ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు ఇటీవల నార్త్ కొరియా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రయెగం విఫలం అవ్వడంతో తర్వలోనే రెండో లాంచ్ కు సిద్దమైనట్టు ఉత్తర కొరియా తెలిపింది.
18వ శతాబ్దపు మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన అరుదైన తుపాకీ పై బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. టిప్పు సుల్తాన్ తుపాకీ ఎగుమతిపై నిషేధం విధించింది. ఈ తుపాకీ దేశం దాటి వెళ్లకూడదని పేర్కొంది.
ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంపెనీ ఎల్వీఎంహెచ్ కంపెనీ లగ్జరీ ప్రొడక్టులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ వివిధ బ్రాండ్లతో కాస్ట్ లీ హ్యాండ్‌బ్యాగ్స్, షాంపులు, ఖరీదైన గౌన్లతో సహా మరెన్నో వస్తువులను తయారు చేస్తుంది.