Samsung Galaxy M36 5G Launch: బొమ్మ బ్లాక్ బస్టర్.. రూ. 20 వేలకే సామ్‌సంగ్ కొత్త ఫోన్.. డిజైన్ అదిరిందిగా

Samsung Galaxy M36 5G Official Launch: టెక్ దిగ్గజ కంపెనీ సామ్‌సంగ్ త్వరలో గెలాక్సీ M36 5Gని త్వరలో భారతదేశంలో లాంచ్ చేయనుంది. సామ్‌సంగ్ గెలాక్సీ M సిరీస్‌లో రాబోయే ఈ ఫోన్ గత సంవత్సరం లాంచ్ అయిన Galaxy M35 5G అప్‌గ్రేడ్ వెర్షన్ అవుతుంది. ఈ ఫోన్ ప్రమోషనల్ పోస్టర్‌ను కంపెనీ విడుదల చేసింది, దీనిలో కెమెరా మాడ్యూల్‌ను టీజ్ చేస్తూ ‘త్వరలో వస్తుంది’ అని రాశారు. ఈ ఫోన్ వెనుక ప్యానెల్ గెలాక్సీ S25 ఎడ్జ్ లాగా ఉంటుంది. దీనిలో మూడు కెమెరాలు చూడచ్చు. ఇది కాకుండా, సామ్‌స్ంగ్ ఈ ఫోన్ డిజైన్ గెలాక్సీ ఎస్ సిరీస్ మాదిరిగానే ఉంచింది.
ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. ఈ సామ్‌సంగ్ ఫోన్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌తో రావచ్చు. దక్షిణ కొరియా కంపెనీ ఫోన్ ధరను వెల్లడించలేదు. దీనిని రూ. 20,000 ప్రారంభ ధరకు ప్రవేశపెట్టవచ్చని లీక్స్ వస్తున్నాయి. దీనిని కొత్త కలర్ ఆప్షన్‌తో పరిచయం చేయవచ్చు. దీని డిజైన్ చూడటానికి చాలా తేలికగా కనిపిస్తుంది.
Samsung Galaxy M36 5G Features
సామ్‌సంగ్ గెలాక్సీ M36 5జీ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీనిలో గూగుల్ జెమిని ఆధారంగా AI ఫీచర్‌ను కనుగొనవచ్చు. ఈ సామ్‌సంగ్ ఫోన్ ఇటీవల సర్టిఫికేషన్ సైట్ గిక్‌బెంచ్‌లో కనిపించింది. జాబితాలో ఉన్న ఫోన్ మోడల్ నంబర్ SM355B, దీనికి 6జీబీ వరకు ర్యామ్ ఉంటుంది. ఈ ఫోన్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OneUIలో పని చేస్తుంది.
ఈ సామ్‌సంగ్ ఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లేతో రావచ్చు. ఇది 120Hz అధిక రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది మాత్రమే కాదు, ఫోన్ వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరాను చూడవచ్చు. అలానే సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఈ సామ్‌సంగ్ ఫోన్‌లో 12MP కెమెరా అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో రావచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో సామ్‌సంగ్ గెలాక్సీ A36 5Gని విడుదల చేసింది. ఈ ఫోన్ 8GB RAM + 128GB బేస్ వేరియంట్‌లో వస్తుంది. దీని ధర రూ.32,999.