Home / ap news
ఏపీ ప్రభుత్వానికి జూనియర్ వైద్యుల సెగ తగిలింది. స్టైఫండ్ 42 శాతానికి పెంచాలంటూ డాక్టర్లు కోరికను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసు కూడా అందించారు. 11 ప్రభుత్వ వైద్య కళాశాలల జూడాలు ఈ సమ్మెలో పాల్గొననున్నారు.
ఇటీవల వివాదాలతో వార్తల్లో కెక్కిన వైసీపీ నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం టీచర్ అవతారం ఎత్తారు. మేడికొండూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠాలు చెప్పారు.
పోలీసులు ఆ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రెడీ అయినారు. ఇంతలో హఠాత్తుగా ఆ వివాహిత క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకొనింది. ఈ ఘటన విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్ లో చోటుచేసుకొనింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు సమన్వయం చేసుకోలేకపోయారని, జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
ఏపీకి ఒకటే రాజధాని.. అదే అమరావతి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.
జనసైనికులకు కోర్ట్ షాక్ ఇచ్చింది. విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై జరిగిన దాడి కేసులో అరెస్ట్ అయిన జనసేన కార్యకర్తలకు కోర్టులో షాక్ తగిలింది.
గుంటూరు పట్టణంలో మంగళవారం రాత్రి ఓ దారుణ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని కొందరు దుండగులు అత్యంత కిరాతంగా కత్తులు, వేటకొడవళ్ళతో వెంటాడి మరీ నరికేశారు. కళ్లముందే జరిగిన ఈ దారుణ హత్యను చూసిన జనం భయభ్రాంతులకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధానిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కుదిరితే అమరావతి రైతుల పాదయాత్రలో తాను కూడా పాల్గొంటానన్నారు
సీఎం జగన్ ఈనెల 27న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలంలోని నేలటూరులో ఏపీ జెన్కో థర్మల్ పవర్ స్టేషన్‌లోని మూడో యూనిట్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, జగన్ అడ్డాలో కోలుమోపాడు. చంద్రబాబు తనయుడు, యువ నాయకుడు అయిన నారా లోకేష్ కడపకు చేరుకున్నారు. లోకేశ్ వస్తున్న సంగతి తెలిసిన తెదేపా పార్టీ శ్రేణులు కడప విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకున్నాయి. లోకేశ్‌కు జనం నీరాజనం పట్టారు.