Home / ap news
పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో.. నిన్న అర్ధరాత్రి కొంతమంది దుండగులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మట్టి పూయడం వివాదాస్పదంగా మారింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అల్లూరి విగ్రహాన్ని పాలతో విగ్రహాన్ని శుభ్రం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు సీఎం జగన్ నేడు నిధులు విడుదల చేయనున్నారు. వివిధ పథకాలకు 3 లక్షల 39 వేల 96 మంది లబ్ధిదారులు కొత్తగా ఎంపిక కాగా, వారందరికీ ఇవాళ నిధులు మంజూరు కానున్నాయి.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందిన కార్యకర్త పాడె మోసారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందని వైసీపీ కార్యకర్త శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి కారుమూరిగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతోంది. మొన్నటి వరకు ఇది ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు కదిలింది. ఇది భూమిపైనే కొనసాగుతూ రెండ్రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రతి పక్షాలతో పాటు కొన్ని మీడియా ఛానల్లు విషం కక్కుతున్నాయని మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ని భ్రష్టు పట్టించాలని ప్రతిపక్షాలు కొన్ని మీడియా ఛానల్లతో పాటు చంద్రబాబు దత్తపుత్రుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.
కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ $600 మిలియన్ల విలువైన సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసింది మరియు అదే సంవత్సరంలో 836,000 టన్నుల మిర్చిని ఉత్పత్తి చేసింది.
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి పాలంకి బ్రదర్స్ షాకిచ్చారు. వైసిపి వీడి వారిద్దరూ జనసేనలో చేరారు. జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ సమక్షంలో పాలంకి సారధిబాబు, మోహన్ బాబు జనసేనలో చేరారు. జనసేన జెండా కప్పి పాలంకి బ్రదర్స్ ను ఆయన సాదరంగా ఆహ్వానించారు.