Last Updated:

IPL 2025: లక్నోతో కీలక మ్యాచ్‌.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి ఓటమి

IPL 2025: లక్నోతో కీలక మ్యాచ్‌.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి ఓటమి

Sunrisers Hyderabad vs Lucknow Super Giants in IPL 2025: ఐపీఎల్‌ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయం నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లలో హెడ్(47) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివరిలో అనికేత్ వర్మ(36) పరుగులు రాబట్టాడు. కమిన్స్(18), క్లాసెన్(26), నితీశ్ రెడ్డి(32) రాణించగా.. అభిషేక్(6), ఇషాన్ కిషన్(0) నిరాశపర్చారు. లక్నో బౌలర్లలో శార్దూల్ 4 వికెట్లు పడగొట్టగా.. అవేశ్ ఖాన్, దిగ్వేశ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని లక్నో 16.1 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో బ్యాటర్లలో పూరన్‌ (70), మార్ష్‌ (52) విరుచుకుపడగా.. పంత్(15), సమద్(22) రాణించడంతో సులువుగా విజయం సాధించింది. అయితే పూరన్ 26 బంతుల్లో 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 70 పరుగులు చేసి మ్యాచ్‌ను తనవైపు లాగేసుకున్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో కమిన్స్‌ 2, షమీ, జంపా, హర్షల్‌ పటేల్‌ తలో వికెట్‌ తీశారు.

ఇవి కూడా చదవండి: