IPL 2025: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ గుజరాత్.. హైదరాబాద్ కోలుకునేనా?

Sunrisers Hyderabad vs Gujarat Titans Match in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్.. గెలుపు బాట పట్టాలని పట్టుదలో ఉంది. అలాగే వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయం నమోదు చేసేందుకు సిద్ధమైంది.
ఈ సీజన్‌లో సన్‌రైజర్లు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్ మాత్రమే గెలిచి.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడడంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇక, గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా.. రెండిట్లో గెలిచి, ఒక్క మ్యాచ్‌లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.