IPL 2025: రాజస్థాన్ ఆల్‌రౌండర్ షో.. పంజాబ్ కింగ్స్‌కి తొలి ఓటమి

Punjab Kings vs Rajasthan Royals Match, Rajasthan Royals won by 50 runs: ఐపీఎల్ 2025లో భాగంగా ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. ఏకంగా ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (67, 45 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. సంజు శాంసన్(38, 26 బంతుల్లో 6 ఫోర్లు)తో కలిసి తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. 10 ఓవర్లు ముగిసే సరికి 85 పరుగులు చేసిన రాజస్థాన్.. తర్వాత ఓవర్‌లో శాంసన్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. 14వ ఓవర్‌లో జైస్వాల్ కూడా ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రియాన్ పరాగ్(43), నితీష్(12), హెట్ మయర్(20), జురెల్(13) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టగా.. అర్ష్ దీప్, యాన్సెన్ చెరో వికెట్ తీశారు.
206 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్‌కి ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఆర్చర్ వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య(0) డకౌట్ అయ్యాడు. అదే ఓవర్‌లో చివరి బంతికి శ్రేయస్ అయ్యర్(10)ను కూడా పెవిలియన్ చేర్చాడు. 4వ ఓవర్‌లో స్లాయినీస్(1) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రభ్ సిమ్రన్ సింగ్(17) కూడా ఔట్ కావడంతో 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నేహాల్ వధేరా(62), మ్యాక్స్ వెల్(30)లు ఇద్దరు జట్టు స్కోరు పెంచేందుకు ప్రయత్నించారు. వీరిద్దరూ 5వ వికెట్‌కు 88 పరుగులు జోడించారు. ఈ సమయంలో భారీ షాట్‌కు ప్రయత్నించి మ్యాక్స్ వెల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్‌లోనే వదేరా కూడా ఔట్ అయ్యాడు. శశాంక్(10), సుయాంశ్(2), యాన్సెన్(3), అర్ష్ దీప్(1), ఫెర్గూసన్(4) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ, తీక్షణ చెరో 2 వికెట్లు, కార్తికేయ, హసరంగ తలో వికెట్ తీశారు.