IPL 2025 – SRH Vs GT: అదే తడబాటు.. గుజరాత్ చేతిలో హైదరాబాద్ ఘోర ఓటమి!

Gujarat Titans won by 7 wickets against Sunrisers Hyderabad in IPL 2025: ఐపీఎల్ 2025లో హైదరాబాద్ మళ్లీ తడబడింది. గుజరాత్ చేతిలో సొంతగడ్డపై హైదరాబాద్ ఘోర ఓటమిని చవిచూసింది. వరుసగా ఒకటి కాదు.. రెండు కాదు… ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
SRH Made 152 Runs in 20 Overs
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(8) మహ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లోనే క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. తర్వాత అభిషేక్ వర్మ(18)ను కూడా సిరాజ్ ఔట్ చేసి హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. దూకుడు ఆడుతున్న ఇషాన్ కిషన్(17) ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్‌లో షాట్ కొట్టేందుకు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దీంతో 50 పరుగలకు హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్(31). క్లాసెన్(27) భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. సాయి కిశోర్ బౌలింగ్ లో ఇద్దరు ఔట్ అయ్యారు. అనికేత్ వర్మను సిరాజ్ మళ్లీ దెబ్బతీశాడు. చివరిలో కమిన్స్(22) పరుగులు చేయడంతో హైదరాబాద్ 152 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ కృష్ణ, సాయి కిశోర్ చెరో రెండు వికెట్లు తీశారు.
Gujarat Titans won by 7 Wickets
153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సుదర్శన్(5) విఫలమైనా గిల్(61) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. సుదర్శన్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్(0) డకౌట్ అయ్యాడు. గుజరాత్ 4 ఓవర్లలో 17 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్(49) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. గిల్ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. సుందర్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రూథర్ ఫర్డ్(47) బ్యాటుకు పనిచెప్పాడు. దీంతో 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. హైదరాబాద్ బౌలర్లలో షమి రెండు వికెట్లు పడగొట్టగా.. కమిన్స్ ఒక వికెట్ తీశాడు.