Published On:

Fingernails are Clues to Your Health: గోళ్లు చెబుతున్న ఆరోగ్య మిస్టరీ.. దీన్ని మీరు తప్పక తెలుసుకోవాలి..!

Fingernails are Clues to Your Health: గోళ్లు చెబుతున్న ఆరోగ్య మిస్టరీ.. దీన్ని మీరు తప్పక తెలుసుకోవాలి..!

What do the nails say about your health..?: గోళ్లపై ఏర్పడే గీతలు మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి. గోళ్లపై ఏర్పడే గీతలు అసాధారమైన అనారోగ్యానికి కారణమవుతాయి. గోళ్ల ఆరోగ్యంతో మొత్తం శరీరానికి సంబంధం ఉందని తెలుస్తోంది.

 

శుభ్రమైన, అందమైన గోళ్లు చేతుల అందాన్ని పెంచుతాయి. గోళ్ల రంగులో మార్పురావడం, విరిగిపోవడం, నల్లగా, పసుపు రంగులోకి మారడం లేదా గోళ్లపై గీతలు కనిపిస్తే అవి అనారోగ్యానికి కారణమవుతాయని అంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలో పోషకాల కొరతను సూచిస్తాయి. గోళ్లపై గీతలు కనిపించడం అనేక కారణాల వల్ల సంభవిస్తాయి. ఇందులో వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలు లేదా శరీరంలో ఏదైనా ప్రత్యేకమైన పోషకం లేకపోవడం వంటివి ఉండవచ్చు.

 

గోళ్లపై పొడవైన తెల్లటి గీతలు కనిపించడం వృద్ధాప్యానికి సంకేతం. శరీరంలో పోషకాలు తగినంతగా అందకపోవడం వలన ఇలాంటివి అగుపిస్తాయి. ఇటువంటి ఆరోగ్య పరిస్థితులు పోషకాహార లోపాలకు దారితీస్తాయి. గోళ్లపై ఏర్పడే తెల్లటి రేఖలు సగం దూరంలో ఉంటే, అది వృద్ధాప్యం వల్ల జరగవచ్చు అని తెలుస్తోంది. ఇది అంతగా ప్రమాదకరమైనది కాదు. కానీ గీతలు చాలా లోతుగా ఉండి, గోళ్లు విరిగి నల్లగా మారుతుంటే, ఇవి ఆనారోగ్యానికి సంబంధించిన సంకేతాలు కావచ్చని నిపుణులు బావిస్తున్నారు.

 

కొన్నిసార్లు, తామర, పొడి చర్మం లేదా హైపోథైరాయిడిజం వంటి సమస్యల కారణంగా, గోళ్లు మందంగా లేదా సన్నగా మారి విరిగిపోవడం ప్రారంభిస్తాయి. లైకెన్ ప్లానస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి వలన గోళ్లపై గీతలు కనిపిస్తాయి. వీటిని బ్యూ లైన్స్ అని కూడా పిలుస్తారు, ఇవి ఒత్తిడి లేదా ఏదైనా వ్యాధి కారణంగా కూడా పెరుగుతాయి.

 

తెల్లని గీతలు కనిపించడం:
దీనిని వైద్య పరిభాషలో ల్యూకోనిచియా స్ట్రియాటా అంటారు. మైక్రోట్రామా, ఒనికోమైకోసిస్ లేదా వంశపారంపర్య వ్యాధుల కారణంగా ఈ రేఖలు కనిపించవచ్చు. రేఖలు పెరుగుతుంటే, మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

 

కొంతమందికి గోళ్లపై నలుపు లేదా గోధుమ రంగు గీతలు ఏర్పడతాయి. వీటిని మెలనోనిచియా అంటారు. గోళ్లపై ఈ గీతలు గాయం, ఇన్ఫెక్షన్ లేదా మందుల వల్ల కూడా సంభవించవచ్చు.

 

నల్ల రేఖలు:

గోళ్లపై నల్ల రేఖలు శరీరంలో విటమిన్ సి, జింక్ మరియు ఇతర పోషకాలు లేకపోవడాన్ని సూచిస్తాయి. దీని కోసం, పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని తినండి. అవును, గోళ్ల రేఖల నుండి రక్తస్రావం లేదా నొప్పి ఉంటే, వైద్యుడిని సంప్రదించండి.

 

తెల్లని గీతలు లేదా బ్యాండ్లు:

వీటిని మీస్ లైన్స్ అంటారు. మీ గోళ్లపై అలాంటి గీతలు లేదా తేలికపాటి బ్యాండ్లు కనిపిస్తే, దానిని తేలికగా తీసుకోకూడదు. ఇది ఆర్సెనిక్ విషప్రయోగం లేదా మూత్రపిండాల వైఫల్యం వంటి ఆరోగ్య పరిస్థితికి కూడా లక్షణం కావచ్చు. వైద్యుడిని సంప్రదించండి.

 

ఇవి కూడా చదవండి: