Published On:

Kantara Chapter 1: కాంతార మూవీ సెట్‌లో మరో విషాదం.. నటుడి మృతి!

Kantara Chapter 1: కాంతార మూవీ సెట్‌లో మరో విషాదం.. నటుడి మృతి!

Rishab Shetty Starrer Kantara Chapter 1 Actor Died: కాంతార మూవీకి ప్రీక్కెల్‌గా ‘కాంతర ఛాప్టర్‌ 1’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి ప్రమాదాలు, విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంతార: ఛాప్టర్‌ 1 సెట్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇందులో నటిస్తోన్న నటుడు, మిమిక్రి ఆర్టిస్ట్‌ కళాభవన్‌ నిజూ (43) మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కాంతార: ఛాప్టర్‌ 1 మూవీ షూటింగ్‌ బెంగళూరులో జరుగుతుంది.

 

షూటింగ్ కోసం గురువారం రాత్రి సెట్‌లోకి వచ్చిన కళాభవన్‌ కాసేపటి ఛాతి నొప్పితో బాధపడ్డాడు. విపరీతమైన నొప్పితో కుప్పకూలిన ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. అయితే ఈ విషయాన్ని మూవీ టీం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాంతార సెట్‌లో కళాభవన్‌ మరణించినట్టు ఆయన స్నేహితులు, మిమిక్రీ ఆర్టిస్ట్‌ కణ్ణన్‌ సాగర్‌ వెల్లడించారు. కాగా కాంతార షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి ఈ సినిమా సెట్‌లో ఏదోక ప్రమాదం జరుగుతూనే ఉంది. ఈ చిత్రం గురించి రకరకాల రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.

 

ఈ సినిమా షూటింగ్‌ మొదలైన తర్వాత కన్నడిగులు విశ్వసించి కంజర్ల దేవుడు, నటుడు, దర్శకుడు రిషబ్‌ శెట్టి హెచ్చరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమా షూటింగ్‌ కోసం బయలు దేరిన జూనియర్ ఆర్టిస్టుల క్యారవాన్‌ బోల్తా పడటంతో పలువురికి గాయాలయ్యాయి. అలాగే ఈ సినిమా నటిస్తున్న జూనియర్‌ ఆర్టిస్టులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. గతంలో ఇద్దరు, ముగ్గురు జూనియర్‌ ఆర్టిస్టులు మరణించగా.. తాజాగా కళాభవన్‌ మృతి చెందడంతో ఆడియన్స్‌, చిత్ర యూనిట్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

కాగా 2020లో విడుదలైన కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా ఇది రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదట ప్రాంతీయ సినిమాగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో విడుదల చేయగా.. ఇక్కడ కూడా మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో మేకర్స్‌ ఈ సినిమాను పాన్‌ ఇండియా భాషల్లో విడుదల చేశారు. చిన్న సినిమాగా వచ్చిన పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం సత్తా చాటింది. కలెక్షన్స్‌ పరంగానే భారీగా వసూళ్లు చేసింది. సౌత్‌లోనే కాదు నార్త్‌లోను కాంతార సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ఈ సినిమాకు ప్రీక్వెల్‌ కాంతార చాప్టర్‌ 1ను తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు రిషబ్‌ శెట్టినే దర్శకత్వం వహించి నటిస్తుండగా.. హోంబాలే ఫిల్మ్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.