IPL 2025 31st Match: కోల్‌కతాతో ఐపీఎల్ పోరు.. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్!

Punjab Kings own the toss and choose bat first against Kolkata Knight Riders IPL 2025 31st Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో ఇవాళ పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఛండీఘర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పంజాబ్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు గెలవగా.. రెండు మ్యాచ్‌లు ఓడింది. అలాగే కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో గెలిచి మరో 3 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.
అలాగే, ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య 33 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 21 మ్యాచ్‌ల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలుపొందగా.. పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక, 2021 సీజన్ నుంచి ఇరుజట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరగగా.. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ చెరో మూడు మ్యాచ్‌లు గెలిచాయి.
ప్రస్తుతం జరుగుతున్న ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ది విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడగా.. 3 మ్యాచ్‌ల్లో గెలిచి మరో 3 మ్యాచ్‌ల్లో ఓడిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా ఒక మ్యాచ్ గెలిస్తే.. తర్వాతి మ్యాచ్‌లో ఓటమి చెందుతోంది. ఇలా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఇదే సీన్ రిపీట్ అయింది.
గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ విషయానికొస్తే.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో తొలి రెండు మ్యాచ్‌లు శ్రేయస్ సేన గెలవగా.. తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో రెండిట ఓడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టులో ఒక మార్పు చేశారు. మొయిన్ అలీ స్థానంలో అన్రిచ్ నోకియాను తీసుకున్నారు.
పంజాబ్: ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), నేహల్ వధేరా, జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్ లెట్, అర్ష్ దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
కోల్‌కతా: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానె(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అన్రిచ్ నోకియా, వరుణ్ చక్రవర్తి.