Minister Lokesh: సామాన్యుడి ట్వీట్ కు స్పందించిన మంత్రి లోకేష్

Minister nara lokesh on manyam district school students: ఓ సామాన్యుడు చేసిన ట్వీట్ కు స్పందించారు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని MPP స్కూల్‌లో జరిగిన ఒక ఆందోళనకర సంఘటన గురించి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న విద్యార్థులను మాజీ MLA.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారు. షాకింగ్‌గా MEO, HM ఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను అనుమతించారు. కార్యక్రమం అనంతరం తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. MEO, HM బాధ్యతారహిత ప్రవర్తనపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
విద్యార్థుల భద్రతను పణంగా పెట్టి, స్కూల్ సమయంలో రాజకీయ నిరసనకు అనుమతించడం చట్ట విరుద్ధం. ఈ సంఘటనను వెంటనే విచారణ జరిపి బాధ్యులైన MEO, HMపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్యామ్ అనే వ్యక్తి కోరాడు. ఆ ట్వీట్ పై స్పందించిన మంత్రి నారా లోకేష్. ఈ ఘటనపై అర్జెంటుగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన పిల్లలు, తల్లిదండ్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఏ రాజకీయ పార్టీ అయినా స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు అని మంత్రి సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దనన్నారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.