Published On:

AP Govt: ఏడాది కాలంలో 4లక్షల ఉద్యోగాలు కల్పించాం

AP Govt: ఏడాది కాలంలో  4లక్షల ఉద్యోగాలు కల్పించాం

AP Govt: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో నిరుద్యోగ యువతకు 4లక్షల ఉద్యోగాలు కల్పించడం కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని మంత్రుల కమిటీ పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి నారా లోకేష్ చాంబర్ లో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు టీజీ భరత్, పొంగూరు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, బిసి జనార్దన్ రెడ్డి హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 

గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5లక్షల ఉద్యోగాల కల్పనకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోగా, అందులో ఇప్పటికే వివిధ రంగాల్లో 3లక్షల 94వేల 416 ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ఇందులో అత్యధికంగా MSME రంగంలో లక్షా 18వేల 268 యూనిట్ల ద్వారా 2లక్షల 48 వేల 902 ఉద్యోగాలు, స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా 73 వేల ఉద్యోగాలు, టూరిజం రంగంలో 49వేల765 ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.

MSME రంగంలో గత పదేళ్లలో సగటున 50వేల ఉద్యోగాలు మాత్రమే లభించగా, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో 5 రెట్లు పెరిగాయని అధికారులు తెలిపారు. వివిధ ప్రభుత్వశాఖలు, ప్రైవేటురంగంలో కల్పిస్తున్న ఉద్యోగాలను గ్రామ సచివాలయాల ద్వారా ట్రాక్ చేసి పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని మంత్రులు సూచించారు.

 

అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, సమిష్టికృషితో ఈ లక్ష్యాన్ని అధిగమించి తీరుతామని చెప్పారు. రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని, అక్కడ అసంఘటిత రంగంలో ఇప్పటికే 10వేలమంది పనిచేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. అత్యధిక ఉద్యోగాలు లభించే మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ సెక్టార్లపై అధికారులు దృష్టిసారించాలని అన్నారు.

ఇవి కూడా చదవండి: