Published On:

IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. కెప్టెన్‌గా శాంసన్ రీ ఎంట్రీ

IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. కెప్టెన్‌గా శాంసన్ రీ ఎంట్రీ

Punjab Kings vs Rajasthan Royals: ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య 28 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రాజస్థాన్ 16 మ్యాచ్‌లు గెలవగా.. పంజాబ్ 12 మ్యాచ్‌ల్లో నెగ్గింది.

 

ఈ సీజన్‌లో రాజస్థాన్ ప్లేయర్ సంజు శాంసన్ గత మూడు మ్యాచ్‌ల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడంతో కెప్టెన్సీకి దూరంగా ఉన్నారు. అయితే పంజాబ్‌తో మ్యాచ్ నుంచి శాంసన్ కెప్టెన్‌గా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

 

పంజాబ్:
మార్కస్ స్టాయినిస్, ప్రభ్ సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), నేహాల్ వదేరా, గ్లెన్ మ్యాక్స్ వెల్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, మార్కూ యాన్సెన్, అర్స్ దీప్ సింగ్, ఫెర్గూసన్, యుజేంద్ర చాహల్.
రాజస్థాన్:
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), హెట్ మయర్, హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్, సందీప్ శర్మ.

 

ఇవి కూడా చదవండి: