IPL 2025: 120 పరుగులకే కుప్పకూలిన హైదరాబాద్.. వరుసగా మూడో ఓటమి

Kolkata Knight Riders beat Sunrisers Hyderabad by 80 Runs: ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుసగా మూడో ఓటమి మూటగట్టుకుంది.
తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో ఓపెనర్లు డికాక్(7), నరైన్(7) విఫలమయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే(38), రఘువంశీ(50) భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.రహానె ఔట్ అయిన తర్వాత వెంకటేశ్ అయ్యర్(60) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరిలో రింకుసింగ్(32) రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్, షమీ, జీషన్, హర్షల్, కమిందు తలో వికెట్ పడగొట్టారు.
201 పరుగుల భారీ లక్ష్యఛేదనలో హైదరాబాద్ తడబడింది. వైభవ్ వేసిన మొదటి ఓవర్‌లోనే హెడ్(4) ఔటయ్యాడు. రెండో ఓవర్‌లో అభిషేక్ శర్మ(2), మూడో ఓవర్‌లో ఇషాన్ కిషన్(2) వరుసగా ఔట్ కావడంతో మూడు ఓవర్లలో 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత నితీశ్ రెడ్డి(19) మెండిస్(27) మెరుపులు మెరిపించిన ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయారు. దీంతో 10 ఓవర్లకు హైదరాబాద్ సగం వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. క్లాసెన్(33), రసెల్(19), కమిన్స్(14) నిరాశపర్చడంతో 16.4 ఓవర్లలోనే 120 పరుగులకు కుప్పకూలింది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు పడగొట్టగా.. రసెల్ 2, హర్షిత్, నరైన తలో వికెట్ తీశారు.