IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ జట్లు మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో రెండు జట్లు సమానంగా ఉన్నాయి. ఇప్పటివరకు రెండు జట్లు మూడు మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో చెరో మ్యాచ్ గెలువగా, రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్‌లో ఎట్టిపరిస్థితిలో గెలిచి తీరాలను రెండు జట్లు జోరుమీద ఉన్నాయి. టాస్ గెలిచిన హైదరబాద్ మొదటగా బౌలింగ్ ఎంచుకున్నది. ముందుగా కేకేఆర్ బ్యాటింగ్ చేయనున్నది.
హైదరాబాద్ జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్‌రెడ్డి హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్/జీషన్ అన్సారీ, ఆడమ్ జంపా ఉన్నారు.
కేకేఆర్ జట్టు : సునీల్ నరైన్, క్వింటన్ డికాక్, అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్ ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ ఆరోరా ఉన్నారు.