Last Updated:

IPL 2025: నేడు గుజరాత్ వర్సెస్ పంజాబ్

IPL 2025: నేడు గుజరాత్ వర్సెస్ పంజాబ్

Gujarat Titans vs Punjab Kings in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

పంజాబ్ జట్టుకు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రావడంతో ఆ జట్టు పటిష్టంగా కనిపిస్తుండగా.. గుజరాత్‌కు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. గతేడాది కూడా గుజరాత్ జట్టుకు గిల్‌యే నడిపించాడు.

 

బలబలాల విషయానికొస్తే.. ఇరు జట్లలోనూ మెరుగైన ఆటగాల్లు ఉన్నారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ప్రతిభావంతులైన ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

 

గుజరాత్: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్, రబడా, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ.

పంజాబ్: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), జోస్ ఇంగ్లిస్, ప్రబ్సిమ్రాన్ సింగ్, ఆర్య, మాక్స్ వెల్, స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెస్, అర్ష్ దీప్ సింగ్, ఫర్గూసన్, చాహల్.

ఇవి కూడా చదవండి: