Last Updated:

IPL 2025: గుజరాత్‌తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

IPL 2025: గుజరాత్‌తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

Gujarat Titans vs Mumbai Indians, Mumbai Indians win toss, opt to bowl: ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ముంబై టాస్ గెలవడంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఈ సీజన్‌లో ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ సీజన్‌లో ముంబై ఆడిన తొలి మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. అంతకుముందు 2024 ఐపీఎల్ సీజన్‌లో ముంబై చివరి లీగ్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో హార్దిక్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడిన సంగతి తెలిసిందే.

 

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు తలో మ్యాచ్ ఆడగా.. రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో ఓటమి చెందాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో విజయాల ఖాతా తెరవాలని దూకుడుగా కనిపిస్తున్నాయి. ఇక, ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 5 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో గుజరాత్ 3 మ్యాచ్‌లలో గెలుపొందగా.. మరో రెండు మ్యాచ్‌లలో ముంబై విజయం సాధించింది. కాగా, గుజరాత్ గెలిచిన 3 మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోనే కావడం విశేషం.

 

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, రూథర్ ఫర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాతియా, రషీబ్ ఖాన్, సాయి కిశోర్, రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), తిలక్ వర్మ, నమన్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, ముజీబ్, సత్యనారాయణ రాజు.