Last Updated:

ICC World Cup 2023: స్పేస్ లో వన్డే ప్రపంచకప్‌ 2023 ట్రోఫీ ఆవిష్కరణ.. వీడియో వైరల్

ICC World Cup 2023: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు క్రేజ్ మాములుగా లేదు. రోజురోజుకు ఈ క్రేజ్ మరింతగా పెరుగుతూ ఉంది. దానికి తగినట్లే ఆటగాళ్లు రాణిస్తున్నారు. కాగా మరికొద్ది రోజుల్లో భారత్ వేదికగా ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్-2023 ప్రారంభం కానుంది.

ICC World Cup 2023: స్పేస్ లో వన్డే ప్రపంచకప్‌ 2023 ట్రోఫీ ఆవిష్కరణ.. వీడియో వైరల్

ICC World Cup 2023: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు క్రేజ్ మాములుగా లేదు. రోజురోజుకు ఈ క్రేజ్ మరింతగా పెరుగుతూ ఉంది. దానికి తగినట్లే ఆటగాళ్లు రాణిస్తున్నారు. కాగా మరికొద్ది రోజుల్లో భారత్ వేదికగా ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్-2023 ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే ఐసీసీ ఈ వన్డే ప్రపంచ కప్ ట్రోఫీ టూర్ అద్భుతంగా సాగనుంది. కాగా వినూత్నమైన పద్దతి ఈ ట్రోఫీ ఆవిష్కరణ ప్రారంభమైంది. భూమికి 1,20,000 అడుగుల ఎత్తులో అంతరిక్షంలో వరల్డ్ కప్ ట్రోఫీని ఐసీసీ ఆవిష్కరించింది. బిస్పోక్ బెలూన్ సహాయంతో ట్రోఫీని అంతరిక్షం అంచులకు పంపించారు. అక్కడి ‘స్ట్రోటోస్ఫియర్’ ను ట్రోఫీ చేరింది. ఆ సమయంలో 4కె కెమెరాలతో స్పేస్ లో ట్రోఫీని కొన్ని షాట్స్ తీశారు. అనంతరం ట్రోఫీ క్రమంగా నేలకు చేరింది. చివరికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ వరల్డ్ కప్ ట్రోఫీ ల్యాండ్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ప్రక్రియకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సెక్రటరీ జైషా తన అధికారిక ట్విటర్ ఖాతాలో వీడియోను షేర్ చేశారు.

టూర్ ఇలా(ICC World Cup 2023)

మంగళవారం నుంచి ట్రోఫీ యాత్ర ప్రారంభమవుతుంది. కువైట్, బహ్రెయిన్, మలేసియా, అమెరికా, నైజీరియా, ఉగాండ, ఇటలీ, ఆతిథ్య భారత్ సహా సుమారు ఇరవై దేశాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ టూర్ కౌంట్‌డౌన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ అన్నారు. ఈ టోర్నీ అతి పెద్దది. క్రికెట్ కు ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఈ క్రీడలో గొప్ప దిగ్గజాలలో కొందరు ఈ ప్రసిద్ధ ట్రోఫీకి దగ్గరగా ఉండే అవకాశాన్ని వీలైంత ఎక్కుమందికి అందించాలనుకుంటున్నాము అని ఆయన తెలిపారు.

క్రికెట్ యావత్ ప్రపంచాన్ని ఏకం చేస్తుంది. ఆరు వారాల పాటు ప్రపంచంలోని పది అత్యుత్తమ జట్లకు ఆతిథ్యం ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నందున దేశవ్యాప్తంగా ఈ ఉత్సాహం పెరుగుతోందని బీసీసీఐ సెక్రటరీ జే షా అన్నారు. ఈ ట్రోఫీ టూర్ మంగళవారం ప్రారంభమై దాదాపు ఇరవై దేశాల్లో పర్యటించి అనంతరం సెప్టెంబర్ 4వ తేదీన భారతదేశంకు తిరిగి చేరనుంది. ఇదిలా ఉంటే ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ డ్రాప్ట్ షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.