Meter Movie Review: వెరీ రొటీన్ కథ.. మీటర్ మూవీ రివ్యూ ఎలా ఉందంటే..?

Cast & Crew

  • కిరణ్ అబ్బవరం (Hero)
  • అతుల్య రవి (Heroine)
  • సప్తగిరి, పోసాని కృష్ణమురళి తదితరులు (Cast)
  • రమేష్ కదూరి (Director)
  • చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు (Producer)
  • సాయి కార్తీక్ (Music)
  • వెంకట్ సి దిలీప్, సురేష్ సరంగం (Cinematography)
2.5

Meter Movie Review: టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసపెట్టి మూవీస్ చేస్తున్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ సంవత్సరంలోనే విడుదలైన‘వినరో భాగ్యము వీర కథ’తో హిట్టు కొట్టిన రెండునెలల్లోనే మీటర్ అంటూ ఫుల్ మాస్ లుక్ లో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు ఈ యంగ్ హీరో. మరి కిరణ్ అబ్బవరం మాస్ మీటర్ ఎలా ఉంది? ఈ మూవీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందనే విషయాలు ఈ రివ్యూలో చూసేద్దాం.

కథ ఏంటంటే:

అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) తండ్రి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అతను నిజాయితీగా పనిచేయడం వల్ల ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటాడు కానీ తన కొడుకును ఎస్సై చేయాలనేది తన కల. కానీ అర్జున్ కి మాత్రం పోలీస్ అవ్వడం ఇష్టం ఉండదు అయినా అనుకోకుండా సెలక్షన్ క్లియర్ చేసి ఎస్సై అయిపోతాడు. ఏదోఒక తప్పుచేసి ఎప్పుడెప్పుడు డిస్మిస్ అవ్వాలా అని అనుకుంటూ ఉన్న టైంలో హోం మినిస్టర్ కంఠం బైరెడ్డితో (పవన్) అర్జున్ కళ్యాణ్‌కి గొడవ వస్తుంది. ఇక ఎలక్షన్స్‌ సమయంలో అధికారంలోకి రావడానికి బైరెడ్డి చేసిన స్కామ్ ఏంటి? దాని వల్ల పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎలా ప్రభావం అయ్యింది అన్న విషయాలు తెలియాలంటే మీటర్ సినిమా చూడాల్సిందే.

చాలా సీన్లు చూసినవే..

పనిపాట లేకుండా గాలికి తిరిగే హీరో సడెన్‌గా పోలీస్ అవ్వడం, అబ్బాయిలంటేనే అసహ్యించుకునే హీరోయిన్ ఒక్క పాటలోనే అర్జున్ ను లవ్ చేయడం, స్టేట్ సీఎంని కూడా వణికించే విలన్.. హీరో ముందు పిల్లిలా మారిపోయి ఉండడం ఇలా ఈ సినిమాలోని చాలా సీన్లు ఇదివరకే చూసినవే ఉంటాయి. సినిమా మొదటి భాగమంతా పోలీస్ అవ్వకుండా ఉండటానికి అర్జున్ కళ్యాణ్ చేసే ప్రయత్నాలు, పోలీస్ అయ్యాక జాబ్ నుంచి డిస్మిస్ అవ్వడానికి చేసే కామెడీ, ఈ మధ్యలోనే హీరోయిన్‌తో లవ్ ట్రాక్ ఇలా ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ సాగుతూ ఉండగా ఒక ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండాఫ్‌లో విలన్ తో కిరణ్ అబ్బవరం గొడవ, యాక్షన్, ఎలివేషన్ సీన్లు ఇంతకు ముందు చాలా పెద్ద హీరోల సినిమాల్లో కూడా కనిపించినవే ఉంటాయి.

నటీనటుల విషయానికి వస్తే.. అర్జున్ కళ్యాణ్ పాత్రలో కిరణ్ అబ్బవరం మాత్రం అదరగొట్టాడు. ఇంక సంగీతం కూడా సోసోగానే ఉందని చెప్పాలి. మొత్తంగా చెప్పాలంటే.. కిరణ్ అబ్బవరం మీటర్‌ మూవీ అనుకున్నంత కాకపోయిన ఓసారి చూసి ఎంటర్టైన్ అవ్వొచ్చు అని ప్రేక్షకుల టాక్.