Published On:

Actress Sana Makbul: క్షిణించిన ఆరోగ్యం.. నడవలేని స్థితిలో తెలుగు హీరోయిన్‌!

Actress Sana Makbul: క్షిణించిన ఆరోగ్యం.. నడవలేని స్థితిలో తెలుగు హీరోయిన్‌!

Sana Makbul Said She Diagnosed With Liver Cirrhosis: బిగ్‌బాగ్‌ విన్నర్‌, నటి సనా మక్బుల్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది. కొంతకాలంగా ఆటో ఇమ్యూన్‌ హైపటైటిస్‌తో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం తాజాగా మరింత క్షిణించింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇటీవల సనా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటో షేర్‌ చేస్తూ తన ఆరోగ్యంపై అప్‌డేట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

ఆస్పత్రి బెడ్‌పై ఆమెను అలా చూసి అభిమానులంత ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు సనా మక్బుల్‌ తన ఆరోగ్యం గురించి ఇలా చెప్పుకొచ్చింది. ఐదేళ్లుగా నేను ఆటో ఇమ్యూన్‌ హైపటైటిస్‌తో బాధపడుతున్న. గతంలోనే దీనికి చికిత్స తీసుకన్నా. కానీ ఏమాత్రం మెరుగవ్వలేదు. అయినా ఎలాగోలా ఇక్కడికి వచ్చాను. కానీ, ఇటీవల పరిస్థితి మరింత దిగజారింది. నా రోగనిరోధక వ్యవస్థ పనితీరు మరింత క్షీణించింది. దాంతో ఇది నా కాలేయంపై దాడి చేయడం ప్రారంభించంది.

 

ప్రస్తుతం నాకు లివర్‌ సిర్రోసిస్‌ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారాణ అయ్యింది. కానీ, నేను బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ఇమ్యునోథెరపీని ప్రారంభించాను. ప్రస్తుతం కోలుకోవడంపై దృష్టి పెట్టాను. అయితే వైద్యులు కాలేయ మార్పిడి అవసరం లేకుండ చికిత్స అందించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు” అని ఆమె పేర్కొంది. పరిస్థితులు చాలా దిగజారాయని, అయినా సరే తాను కోలుకోనేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది. ఇది అంత సులభం కాదని, కానీ తాను అంత తేలికగా వదిలిపెట్టనని తెలిపింది.

 

కాగా ప్రస్తుతం ఆమె తన స్వతహాగా నెమ్మది నెమ్మదిగా నడుస్తున్నట్టు చెప్పింది. ఈ పరిస్థితి తనను శారీరకంగా, మానసికంగా ప్రభావితం చేసిందని ఆమె పేర్కొంది. కాగా సనా మక్భుల్‌ హిందీలో ‘ఇస్‌ ప్యార్‌కో ఖ్యా నామ్‌ ధూ’ సీరియల్‌తో మంచి గుర్తింపు పొందింది. ఇందులో లావణ్య తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సీరియల్లో నటించిన ఆమె హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ-3లో కంటెస్టెంట్‌గా పాల్గొని విన్నర్‌గా నిలిచింది. తెలుగులో దిక్కులు చూడకు రామయ్యా, మామ ఓ చందమా వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.