Tulsi Health Benifits: ఖాళీ కడుపుతో తులసీ ఆకులు: ఆరోగ్యానికి అద్భుత రహస్యం!
tulsi health benifits in telugu: ప్రతీ రోజు పరగడుపున 5 తులసీ ఆకులను తింటే శరీరంలో రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో తులసికి చాలా ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఇది శతాబ్దాలుగా భారతీయ సమాజంలో తన స్థానాన్ని నిలుపుకుంది. ఆరోగ్యమే కాకుండా ఆద్యాత్మికంలోనూ తులసిని పవిత్రంగా కొలుస్తారు.
తులసిని రోజూవారి జీవితంలో భాగం చేసుకోవడం వలన 5లాభాలను ముఖ్యంగా చెబుతున్నారు.
1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
తులసి ఆకులలో యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన నూనెలు సమృద్ధిగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయన్నారు. ఖాళీ కడుపుతో తులసీ ఆకులను ప్రతీరోజు తినడం వలన శరీరానికి రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధులకు రక్షణ గోడలా నిలుస్తుంది. తులసిలో ఉండే యాంటీమైక్రోబయల్ హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ తో పోరాడుతుంది.
2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
తులసి ఆకులు జీర్ణవ్యవస్థను పఠిష్టం చేస్తుంది. దీంతోపాటే ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తొలగిస్తుంది. తులసి ఆకులు జీర్ణ సమస్యలను నివారస్తుంది. ఈ ఆకులు జీర్ణ ఎంజైమ్ లను ఉత్పత్తికి కారణమవుతాయి. ఇవి ఆహారాన్ని మరింత సమర్థవంతంగా విచ్చిన్నం చేయడంలో సహాయపడతాయి.
3. ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది
తులసిని అడాప్టోజెన్ అని పిలుస్తారని నిపుణులు సూచిస్తున్నారు. అడాప్టోజెన్ అంటే శరీరానికి ఒత్తిడి లేకుండా చేస్తుంది. ఉదయం తులసి ఆకులను తీసుకోవడం వలన ఒత్తిడి తగ్గుతుంది. ఇది కార్టిసాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో త్వరగా ఆందోళన తగ్గుతుంది, మానసిక స్పష్టతను ప్రోత్సహిస్తుంది. తులసి ఆకులను రోజూ తినడం వలన మానసికస్థితి పెరుగుతుంది. భారతీయుల దినచర్యలో కూడా తులసి చెట్టుకు పూజ చేసిన తర్వాత రెండు తులసి ఆకులను కళ్లకద్దుకుని తినే ఆచారం కనపడుతుంది.
4. శరీరాన్ని విషతుల్యం కాకుండా సహాయపడుతుంది
తులసి ఆకులు శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను తగ్గించేందుకు ఉపయోగపడతుంది. శరీరాన్ని విషతుల్యం కాకుండా కాపాడతాయి తులసీ ఆకులు. వీటిని ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు కాలేయాన్ని శుద్దిచేస్తుంది. రక్తంలో వ్యర్థ ఉత్పత్తులు పెరగకుండా తులసి ఆకులు ఉపయోగపడతాయి. రక్తంలో విషతుల్యమైన సామర్థ్యాన్ని ఎదుర్కునే శక్తిని ఇస్తుంది. ఆరోగ్యకరమైన చర్మానికి తులసీ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి.
5. శ్వాసకోశ ఆరోగ్యాన్ని తులసి మెరుగుపరుస్తుంది
తులసి ఆకులలో బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ-వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశ ఆరోగ్యానికి బలం చేకూరుస్తుంది. ప్రతిరోజూ తులసీ ఆకులను తినడం వలన జలుబు, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాసకోశ పరిస్థితులను నివారించవచ్చు. తులసి సహజమైన కఫాన్ని తగ్గిస్తుంది. శ్లేష్మాన్ని తొలగించడంతోపాటు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
ఇన్ని లాభాలు ఉన్న తులసి ఆకులను ఎలా తినాలి..
తులసి ఆకులను తెంపుకుని బాగా కడిగి పరగడునున నమిలి తినండి.
తులసి టీ: కొన్ని తులసి ఆకులను తీసుకుని నీటిలో 5-10 నిమిషాలు మరిగించి వడగట్టి హెర్బల్ టీ తయారు చేసుకోండి. ఇందులో కొంచె తేనె వేసుకోవచ్చు.
తులసి నీరు : తులసి ఆకులను 10కిపైగా తీసుకుని గ్లాస్ నీటిలో రాంత్రంతా నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి.
తులసి రసం: తులసి ఆకులను అప్పుడే తెంపి ఆ తాజా ఆకులనుండి రసం తీసి నీటిలో కలపి తాగండి.
ప్రతీరోజు తులసి ఆకులను తీసుకోవడం వలన ఆరోగ్యం గణనీయంగా పెరుగుతుంది.