Last Updated:

CPI Ramakrishna: పొత్తులకు మేం రెడీ.. ఒక్క భాజపా తప్ప.. కమ్యూనిస్ట్ నేత రామకృష్ణ

కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ప్రధాన కార్యదర్శి రామకృష్న తెదేపా, జనసేనలతో కలిసి నడిచేందుకు తాము రెడీ అంటూ ప్రకటించారు.

CPI Ramakrishna: పొత్తులకు మేం రెడీ.. ఒక్క భాజపా తప్ప.. కమ్యూనిస్ట్ నేత రామకృష్ణ

Ap Politics: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెదేపా, జనసేనలతో కలిసి నడిచేందుకు తాము రెడీ అంటూ ప్రకటించారు. ఆ రెండు పార్టీలు కలవడం కూడా మంచిదేనంటూ వ్యాఖ్యానించారు. భాజపాతోనే తమ అభ్యంతరమన్నారు. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనను అంతమొందించేందుకు కమ్యూనిస్ట్ పార్టీ రెడీగా ఉందన్నారు.

గత నాలుగు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పొత్తుల అంశాలను పలు పార్టీలు వెల్లడిస్తున్నాయి. నిన్నటిదినం తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడుతూ అధికార పార్టీ రాక్షసపాలనకు చరమగీతం పలకాలంటే రాజకీయ పార్టీల మనుగడ ఎంతో ముఖ్యంగా పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందంటూ, అందుకు  తెదెపా రెడీ అంటూ సంకేతాలు కూడా ఇచ్చారు.

ఇది కూడా చదవండి: వైసిపి నేతలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. దవడ వాచిపోయేలా కొడతా.. దేంతోనంటే?

ఇవి కూడా చదవండి: