Last Updated:

Chandrababu: బీజేపీతో పొత్తు వద్దే వద్దు.. చంద్రబాబుకు తమ్ముళ్ల రిక్వెస్ట్

ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి అధికారంలోకి వస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు టీమ్ ధీమాతో ఉంది. ఆ లెక్కలతోనే బీజేపీ సైతం టీడీపీని దగ్గర చేర్చుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది . అయితే బీజేపీతో పొత్తు విషయమై టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంట,

Chandrababu: బీజేపీతో పొత్తు వద్దే వద్దు.. చంద్రబాబుకు తమ్ముళ్ల రిక్వెస్ట్

Andhra Pradesh: ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి అధికారంలోకి వస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు టీమ్ ధీమాతో ఉంది. ఆ లెక్కలతోనే బీజేపీ సైతం టీడీపీని దగ్గర చేర్చుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే బీజేపీతో పొత్తు విషయమై టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంట, పొత్తు విషయంలో మా మాట వినండని అధినేత పై కేడర్ ఒత్తిడి పెంచేస్తుందంట. దాంతో చంద్రబాబు డైలమాలో పడ్డారంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మద్దతు తప్పనిసరన్న అభిప్రాయం ఉంది. 2019 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. బీజేపీతో దోస్తీ కట్ చేసుకున్న టీడీపీ ఎంత దెబ్బ తినిందో వేరే చెప్పనవసరం లేదు. అదే స్థాయిలో వైసీపీ లాభపడింది. అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్రంతో స్నేహాన్ని కోరుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. ముఖ్యంగా జనసేనకు దగ్గర అవ్వడానికే ఆయన కాషాయపార్టీకి స్నేహహస్తం అందిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అటువైపున కేంద్ర పెద్దలు కూడా తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం టీడీపీకి దగ్గరవ్వాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు మాత్రం బీజేపీతో పొత్తు వద్దంటూ బాబు పై ఒత్తిడి తెస్తున్నారంట.

లోక్‌సభ నియోజకవర్గం నుంచి గ్రామస్థాయిలో బూత్ వరకు పూర్తిగా బలం కలిగివున్నామని,క్యాడర్ ఉందని, సొంతంగా 175 నియోజకవర్గాల్లో గెలవగలిగేంత బలం పార్టీకి ఉన్నప్పటికీ మనల్ని మనం బలహీనులుగా మార్చుకోవద్దని, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏమవుతుందనేది గతంలోను, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయని బాబు దృష్టికి తీసుకెళ్తున్నారంట, అవసరతమైతే జనసేనతో కలిసి నడుద్దాం కాని బీజేపీతో పొత్తు వద్దని ఖరాకండీగా చెప్తున్నారంట. ఎవరూ కలిసి రాకపోతే ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొందామంటూ ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. ఏపీలో బీజేపీకి ఎంత ఓట్ల శాతం ఉందనేది అందరికీ తెలుసని, మనం ఆ పార్టీ పొత్తు కోసం వెంపర్లాడుతున్నామని, టీడీపీ పనైపోయిందని జరుగుతున్న ప్రచారం మంచిది కాదని చెపుతున్నారంట, చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకత్వం వహించలేరని, ఆ పార్టీకి నాయకులు లేరంటూ ప్రచారం చేస్తున్నారని, అదే కొనసాగితే ప్రజలు కూడా నిజమనుకుంటారని చెపుతున్నారంట, ఆ క్రమంలో కావాలంటే గెలుపొందిన తర్వాత బీజేపీకి మద్దతివ్వొచ్చంటూ కొందరు నేతలు బాబుకు సూచించినట్లు సమాచారం. అయితే తన ఆలోచనా వైఖరిని మాత్రం బాబు వెల్లడిచేయలేదని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి వైసీపీని ఓడించడానికి కుట్ర పన్నాయంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడంవల్ల ప్రజల్లో వారిపై సానుభూతి ఏర్పడుతుందేకానీ పార్టీపై సానుకూలత పెరగడంలేదని తెలుగు తమ్ముళ్లు చెపుతున్నారంట, మీ హయాంలో ఎన్నోఎన్నికలను ఎదుర్కొన్నామని, అటువంటి ఇప్పుడు టీడీపీ పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లలేకపోతోందని, ఆ పార్టీ బలహీనపడిందంటూ వైసీపీ చేస్తోన్న ప్రచారం ఇబ్బందికరంగా ఉందంటున్నారు. ప్రజలు ఓటు వేయాలి అనుకుంటే వేస్తారని, అందులో సందేహం అవసరంలేదని, కానీ వారు వద్దు అనుకుంటే ఓటు వేయరని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ప్రజలంతా ఇప్పుడు రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలోకి నడిపించగలిగేది ఒక్క చంద్రబాబునాయుడే అనుకుంటున్నారని, కాబట్టి మనం ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా వచ్చే ఇబ్బంది లేదని ఒత్తిడి పెంచుతున్నారంట, మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

follow us

సంబంధిత వార్తలు