Munugode: తులం బంగారం.. 40 వేలు క్యాష్.. మునుగోడు ఓటర్లకు భారీ ఆఫర్లు..!
రాష్ట్రంలో మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు తులం బంగారం ఇస్తామని కొందరు, 40వేలు క్యాష్ ఇస్తామంటూ మరికొందరు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇందంతా అఫీషియల్ కాదండోయ్ అంతా తెరచాటు రాజకీయమే. ఇది నేను చెప్తున్న మాట కాదు ఆ నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్.

Munugode: రాష్ట్రంలో మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీ నేతలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇందంతా అఫీషియల్ కాదండోయ్ అంతా తెరచాటు రాజకీయమే. ఇది నేను చెప్తున్న మాట కాదు ఆ నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్. తులం బంగారమిస్తామని కొందరు అంటే రూ.40 వేలు క్యాష్ ఇస్తాం తమకు మద్ధతు ఇవ్వాలని మరికొందరు ఓటర్లకు మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఓటర్లను తమ వలలో వేసుకునేందుకు రాజకీయ పార్టీలు భారీ ప్లాన్స్ వేస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఓ పార్టీ ఇంటికి రూ.40 వేలు ఇస్తామని చెప్పగా, మరో పార్టీ ఇంటికి తులం బంగారం ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. మరి ఈ ధరలు నామినేషన్ల పర్వం ముగిసే లోపు మరింత పెరిగే అవకాశముందనే ప్రచారం కూడా జోరుగా వినిపిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడమే ఇందుకు కారణమని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఓటర్లు కూడా ఈ ఆఫర్లకు ఆకర్షితులైనట్టే కనిపిస్తోందని పలు అభిప్రాయాలు కూడా నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల నియోజకవర్గంలో నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమానికి వచ్చిన అనూహ్య స్పందనే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు.
ఇదీ చదవండి: వైకాపా అసమ్మతి నేత దారుణ హత్య.. వేటకొడవళ్లతో వెంటాడి మరీ..!