Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

Two Women Naxalites Died Encounter in Chhattisgarh’s Narayanpur: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. నారాయణపుర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మాడ్ డివిజన్ సీనియర్ కేడర్ అబూజ్మడ్ అడవుల్లో ఉన్నారన్న సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ నారాయణపుర్, కొండగావ్ ఎస్టీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.