MLC Kavitha: కేసీఆర్ సత్తా కాంగ్రెస్ కు బాగా తెలుసు

Kavitha Comments On Congress: కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నేడు పోస్ట్ కార్డ్ రాశారు. దాన్ని పోస్ట్ చేసేందుకు అబిడ్స్ పోస్ట్ ఆఫీసుకు వచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చకు రెడీ అన్నారు. కలలో కూడా కేసీఆర్ తెలంగాణ నష్టం చేయరని, కేసీఆర్ దమ్ము ఎంటో కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసునన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు.
ఏపీ చంద్రబాబును ప్రజాభవన్ కు సీఎం రేవంత్ రెడ్డి పిలిచి.. హైదరాబాద్ బిర్యానీ తినిపించారని అన్నారు. గోదావరి నీటిని ఆయనకు గిఫ్ట్ ప్యాక్ గా అందించారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో బనకచర్ల ప్రస్తావనే లేదని.. సీఎం హోదాలో కేసీఆర్ ఎక్కడా సంతకాలు పెట్టలేదని పేర్కొన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, హైకోర్టు ఇచ్చిన గడువు లోపు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే కాంగ్రెస్ కు రానున్న రోజుల్లో భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు.