Published On:

Telangana High Court: మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు పెట్టాలి

Telangana High Court: మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు పెట్టాలి

High Court On Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల గడువు కోరగా, రాష్ట్ర ఎన్నికల సంఘం 60 రోజుల గడువు కోరింది. దీంతో 30 రోజుల్లో వార్డు విభజన చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన కోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ మొదలు కానుంది. మొత్తంగా సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. కాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నల్గొండకు చెందిన మాజీ సర్పంచ్ లు హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా 2024 ఫిబ్రవరి 1న రాష్ట్రంలో సర్పంచ్ పదవీకాలం ముగిసింది. దీంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

ఇవి కూడా చదవండి: